RC16 లో కన్నడ సూపర్ స్టార్.. రాంచరణ్ మూవీ కోసం లుక్ టెస్ట్ పూర్తి!

ఇండియన్ సినిమా రంగంలో అరుదైన సూపర్ స్టార్స్‌లో కన్నడ కరుణడ చక్రవర్తి శివకుమార్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇన్‌స్పైర్ చేస్తే పాత్ర ఎదురుపడితే తన ఇమేజ్‌ను కూడా పక్కన పెట్టి దానికి పూర్తి న్యాయం చేసి అభిమానులను ఆకట్టుకోవడంలో ఆయన దిట్ట. అలాంటి నటుడు కేవలం కన్నడ సినిమాకే పరిమితం కాకుండా దక్షిణా సినిమాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా రూపొందుతున్న RC16 చిత్రంలో కీలక పాత్రను పోషించనున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

కన్నడ సినిమా రంగాన్ని తనదైన శైలిలో మెప్పిస్తూ రూల్ చేస్తున్న శివరాజ్ కుమార్ తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కీలక పాత్రను పోషించి దక్షిణాది సినీ అభిమానుల ప్రేమను సొంతం చేసుకొన్నారు. ఇక తమిళ సినిమా తర్వాత ప్రస్తుతం తెలుగులో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నారు. ఈ మేరకు తన అంగీకారం తెలపడంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు మార్గం సుగమమైంది.

Kannada Super Star Shiva Rajkumar to play crucial role in Ram Charan s RC16

RRR, గేమ్ ఛేంజర్ సినిమాల తర్వాత గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం RC16. ఈ సినిమాకు పెద్ది అనే వర్కింగ్ టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ సినిమాను అట్టహాసంగా ఇటీవలే ప్రారంభించి షూటింగు వేగంగా పూర్తి చేస్తున్నారు. గత నవంబర్‌లో మైసూర్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో మరో కీలక షెడ్యూల్‌ను ముగించింది. క్రికెట్ నేపథ్యంగా సాగే ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

RC16 సినిమాలో బాలీవుడ్, ఇతర భాషల చిత్రాలకు సంబంధించిన స్టార్ యాక్టర్లు చాలా మంది పనిచేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాను బలంగా, మలుపుతిప్పే పాత్రలో ఆయన నటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు లుక్ టెస్ట్ చేసి.. ట్రయల్ షూట్ కూడా పూర్తి చేశారు. శివన్న టెస్ట్ లుక్‌పై సంతృప్తి చెందిన బుచ్చిబాబు.. త్వరలోనే ఆయనపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Kannada Super Star Shiva Rajkumar to play crucial role in Ram Charan s RC16

అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే వారిపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరా బాధ్యతలు స్వీకరించారు. అవినాష్ కోల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫ్యామిలీ ఎమోషన్స్‌తో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నారు. వచ్చే దసరాకు గానీ,.. సంక్రాంతికి గానీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: shiva rajkumar ram charan rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X