నిర్మాతగా సూపర్ స్టార్ కుమార్తె.. తండ్రినే హీరోగా పెట్టి భారీ ప్రాజెక్ట్.. ఆ సినిమా ఏంటంటే?
సినీ రంగంలో స్టార్ హీరోలు, హీరోయిన్ల వారసులు రావడం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు ఎంతో మంది లెజెండరీ యాక్టర్ల కుమారులు, కూతుళ్లు ఇండస్ట్రీలోకి వచ్చి తమకు తాము నిరూపించుకొనే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ, ఏఎన్నాఆర్ వారసుడిగా అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వారసులు వచ్చి తమ ప్రతిభను రుజువు చేసుకొంటూ స్టార్స్‌గా కొనసాగుతున్నారు. అదే దారిలో సూపర్ స్టార్ కూతురు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించనున్నారు. ఆ వారసురాలి సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
కన్నడ సినిమా పరిశ్రమలో కన్నడ కంఠీరవగా పేరున్న రాజ్ కుమార్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని శివ రాజ్‌కుమార్, పునీత్ రాజ్ కుమార్ స్టార్స్‌గా ఎదిగారు. ప్రస్తుతం వారి బాటలోనే వారసులు రాబోతున్నారు. శివ రాజ్ కుమార్ కూతురు నివేదిత శివరాజ్ కుమార్ శాండల్ఉడ్‌లోకి ప్రవేశిస్తున్నారు.

నివేదిత శివరాజ్ కుమార్ ఇప్పటి వరకు నిర్మాతగా తనకంటూ కన్నడ వినోద పరిశ్రమలో ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు. వారసత్వ తనపై పడకుండా సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్నడ పరిశ్రమలో టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లను నిర్మించి తానేంటో ప్రూవ్ చేసుకొన్నారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
తన సొంత బ్యానర్ శ్రీ ముత్తు సినీ సర్వీసెస్ బ్యానర్‌పై ఫైర్ ఫ్లై అనే చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. దీపావళీ కానుకగా రిలీజ్ చేసే ఉద్దేశంతో మూవీని ప్రారంభించారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న నాలుగో ప్రొడక్షన్ హౌప్ కావడం గమనార్హం. గతంలో రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ పూర్ణిమ ఎంటర్‌ప్రైజెస్ స్థాపించగా, పునీత్ రాజ్ కుమార్ పీఆర్కే ప్రొడక్షన్ హౌస్, శివరాజ్ కుమార్ సతీమణి గీతా పిక్చర్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు.

నివేదిత శివరాజ్ కుమార్ నిర్మించే సినిమాలో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా అతిథి పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. అభిలాష్ కల్లాతి సినిమాటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
కన్నడ సినీ పరిశ్రమలో ఫైర్ ఫ్లై చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. శివన్న, పునీత్, రాజ్ కుమార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా పరిశ్రమలో రాణిస్తున్న నివేదిత ఇండస్ట్రీలో కూడా అగ్ర నిర్మాతగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











