IIFA 2024 Utsavam Award: జైల్లో దర్శన్.. ఐఫాలో దుమ్మురేపిన కన్నడ కాటేరా.. ఎన్ని అవార్డులు వచ్చాయంటే?
IIFA 2024 Utsavam Award : భారత దేశ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుకలు (IIFA 2024 Utsavam Award) యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా శనివారం అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో ప్రతిభావంతులను పురస్కారాలతో సత్కరించారు. కాగా కన్నడ సూపర్ స్టార్ దర్శన్ నటించిన ' కాటెరా ' మూవీ IIFA అవార్డుల బరిలో నిలిచి, భారీ సంఖ్యలో అవార్డు కైవసం చేసుకోని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐఫా అవార్డుల వేడుకల్లోఈ మూవీ ఎన్ని అవార్డులు అందుకుందో? ఏ ఏ విభాగాల్లో ఈ మూవీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందో? మీరు కూడా ఓ లూక్కేయండి.
కన్నడ సూపర్ స్టార్ దర్శన్, ఆరాధన రామ్ జంటగా, జగపతిబాబు, కుమార్ గోవింద్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కాటేరా. ఈ మూవీకి రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరించగా, తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్, ఎమోషనల్ మూవీకి వీ హరికృష్ణ సంగీతం, సుధాకర్ ఆర్ రాజ్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ మూవీ డిసెంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే.

'కాటేరా' మూవీకి హై బజ్ ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో రిలీజ్ చేశారు. హీరో దర్శన్ సినిమా కెరీర్‌లోనే అత్యధికంగా స్క్రీన్లలో ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను సుమారుగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 4 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీని 50 కోట్ల రూపాయలతో నిర్మించగా.. క్రేజ్ గా భారీ స్థాయిలో బిజిసెన్ జరగడంతో దాదాపు 100 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం
హీరో దర్శన్ నటించిన 'కాటేరా' కేవలం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ లను వసూలు చేయడమే కాదు. ఇప్పటి వరకూ ఎన్నో అవార్డులు అందుకుంది. తాజాగా మరోసారి అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డ్స్ 2024 వేడుకల్లో కాటేరా మూవీ దుమ్మురేపుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ సుధీర్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డును ఐఫా అందించింది. అవార్డు అందుకున్న తర్వాత తరుణ్ తన భార్య సోనాల్‌తో కలిసి స్టెప్పులేశాడు. అలాగే కాటేరా మూవీకే బెస్ట్ డెబ్యూ అవార్డు ఆరాధన కు దక్కింది.

అలాగే.. తెలుగు స్టార్ యాక్టర్ జగపతిబాబు 'కాటేర' చిత్రంలో విలన్‌గా నటించారు. ఆయన IIFA ఉత్తమ విలన్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును సుమలత అంబరీష్ గార అందుకున్నారు. ఆ తరువాత కాటేరా మూవీకి సంగీతం అందించిన వి. హరికృష్ణ కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకున్నారు. అలాగే.. ఈ చిత్రంలో నటించిన నటి శృతి ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది. ఇలా కన్నడ కటేరా మూవీ ఏకంగా 5 అవార్డులు అందుకుంది
ఇదిలా ఉంటే.. ఐఫా ఈవెంట్ వేడుకలో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్ రెహమన్, వెంకటేశ్, బాలకృష్ణ, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు.
ఐఫా 2024కు గాను ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. మరోవైపు ఉత్తమ చిత్రం విభాగంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు అవార్డు దక్కగా.. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో దసరా సినిమాకు నాని అవార్డు అందుకున్నారు.


Click it and Unblock the Notifications











