HBD Kichcha Sudeep విజయేంద్రప్రసాద్‌తో చేతులు కలిపిన సుదీప్ కిచ్చ.. RRR రైటర్‌తో పాన్ ఇండియా మూవీ!
కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ మరో పాన్ ఇండియా మూవీతో రెడీ అవుతున్నాడు. విక్రాంత్ రోణ మూవీతో భారీ విజయం అందుకొన్న సుదీప్ మరోసారి భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఆర్‌సీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుదీప్ జన్మదినం సందర్భంగా ఈ క్రేజ్ ప్రాజెక్టును నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాది సినీ పరిశ్రమలో విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్న హీరో సుదీప్ కిచ్చు. ఈగ, బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటిని సంపాదించుకొన్నారు. ఇటీవల వచ్చిన విక్రాంత్ రోణ సినిమా భారీ కలెక్షన్లు సాధించి సుదీప్ పాపులారిటిని మరింత పెంచింది.

సెప్టెంబర్ 2వ తేదీన కిచ్చ సుదీప్ పుట్టిన రోజు. బర్త్ డే సందర్బంగా ఆర్సీ స్టూడియో తమ క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు ఆర్ చంద్రూ దర్శకత్వం వహిస్తున్నారు. RRR, బాహుబలి మూవీస్‌తో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకొన్న విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్టుకు సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

కిచ్చ సుదీప్‌తో పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న ఆర్సీ స్టూడియో బ్యానర్ కన్నడలో భారీ చిత్రాలు నిర్మించింది. ఆర్ చంద్రూ, కిచ్చ సుదీప్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఇంకా నటీనటుల, సాంకేతిక నిపుణులు వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











