సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు సంపత్ అనుమానాస్పద మృతి..!

కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ టీవీ నటుడు సంపత్ జె రామ్ శనివారం బెంగళూరులోని నేలమంగళలోని తన ఇంట్లో శవమై కనిపించాడు. అయితే ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, నటుడు రాజేష్ ధృవ వెల్లడించారు. ఫేస్ బుక్ వేధికగా తన ప్రాణ స్నేహితుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాడు. తన స్నేహితుడి మృతి వార్తను తాను భరించలేకపోతన్నట్లు వెల్లడించాడు.

సంపత్ మరెన్నో సినిమాల్లో కనిపించాలని, కలిసి నటించాలని కోరుకున్నట్లు తెలిపాడు. ఆ కలలు సాకారం కాకముదే ఆయన చనిపోవడం చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సంపత్ జె రామ్ వయసు 35 ఏళ్లు. ఈయన 'అగ్నిసాక్షి', 'శ్రీ బాలాజీ ఫోటో స్టూడియో' వంటి అనేక టీవీ సీరియల్స్, సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. సంపత్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఎన్ఆర్ పురాలో నిన్న జరిగాయి.

Kannada television actor sampath Found Dead At Bengaluru Home

మరోవైపు సంపత్ జె రామ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నివాసంలో ఆయన మృతదేహం లభించిన తీరు చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అర్థం అవుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంపత్ మృతి వార్త తెలుుకున్న ఆయన అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే సంపత్ జె రామ్ గత కొంత కాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు అవకాశాలు రాకపోవడంపై చాలా వేధనను అనుభవించాడని అంతా అనుకుంటున్నారు. అయితే ఆ బాధను భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

సంపత్ ఇలా చేసుకుంటాడని తాను ఊహించలేదంటూ ఆయన స్నేహితుడు, నటుడు సూర్య తెలిపారు. అతను నటుడిగా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడని.. త్వరలోనే అతను ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అంతా అనుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. కానీ ఇంతలోనే సంపత్ మృతి వార్త తెలిసిందని... చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X