నటి శోభిత ఆత్మహత్య.. ఉలిక్కిపడిన చిత్ర పరిశ్రమ..
Shobhita Shivanna: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పలు చిత్రాలలో నటించిన నటి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఎవరో కాదు.. కన్నడ బుల్లితెర నటి శోభిత శివన్న (Sobhita Shivanna) సూసైడ్ చేసుకుంది. కన్నడ టీవీ సీరియల్ బ్రహ్మగంతు ఫేమ్ శోభితా శివన్న కన్నుమూశారు. హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
శోభిత శివన్న హాసన్‌లోని సకలేష్‌పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బెంగళూరుకు వచ్చింది. దాదాపు శోభిత 12కి పైగా కన్నడ సీరియల్స్‌లో నటించింది. అందులో చిదపాట, మంగళగౌరి, కోగిలే, బ్రహ్మగంతు, కృష్ణ రుక్మిణి, దీపవు నిందే గుడ్గియు నిందే, అమ్మవారు, మణెదేవ వంటి అనేక సీరియల్స్‌లో నటించారు. కన్నడ సినిమాలో రెండు మూడు సినిమాల్లో కూడా నటించింది.పలు ప్రోగ్రామ్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

నటి శోభిత శివన్న నటించిన బ్రహ్మగంతు సీరియల్‌లో విలన్‌గా కనిపించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ నటి మే 22, 2023న వివాహం చేసుకున్నారు. అయితే నటి శోభిత శివన్న పెళ్లి చేసుకున్న అబ్బాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ పెళ్లి తర్వాత నటి హైదరాబాద్‌లో నివసించింది. శోభిత అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు.
నటి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుతోంది. పెళ్లయినప్పటి నుంచి సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది. హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. అయితే ఈ షాకింగ్ న్యూస్ విని శోభిత కుటుంబ సభ్యులు, సన్నిహితులు షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











