ప్రముఖ యాంకర్ దుర్మరణం.. రోడ్డు ప్రమాదంలో ఫ్రెండ్‌తో సహా..

By Rajababu

Recommended Video

కన్నడ యాంకర్ చంద్రశేఖర్ దుర్మరణం

ప్రముఖ కన్నడ యాంకర్ చందన్ అలియాస్ చంద్రశేఖర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని దావణగేరే జిల్లాలోని హరిహర సమీపంలోని హనగవాడి‌లో చోటుచేసుకొన్నది. ఈ ప్రమాద ఘటనలో చందన్ ఫ్రెండ్ సంతోషి కూడా మృత్యవాత పడ్డారు. చందన్ మరణవార్తతో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చందన్ మృతిపై సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

 బెంగళూరుకు వెళ్తుండగా,

బెంగళూరుకు వెళ్తుండగా,

మీడియా కథనాల ప్రకారం.. చందన్ హుబ్బలి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ చేపట్టారు.

 టీవీ, సినీ రంగాల్లో

టీవీ, సినీ రంగాల్లో

టెలివిజన్ రంగంలోనే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించారు. అత్యంత ప్రజాదరణ పొందిన పోర్కి చిత్రంలో కూడా ఆయన నటించారు. ఆయన వయసు 34 సంవత్సరాలు.

 రాజ్‌కుమార్‌తో సెన్సేషనల్‌ ఇంటర్వ్యూ

రాజ్‌కుమార్‌తో సెన్సేషనల్‌ ఇంటర్వ్యూ

దివంగత దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, ఆయన సతీమణి శ్రీమతి పార్వతమ్మ రాజ్‌కుమార్‌తో చందన్ చేసిన ఇంటర్వ్యూలో అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఇక పోర్కి చిత్రంలో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌తో కలిసి చందన్ నటించారు.

సోషల్ మీడియాలో సంతాపం

చందన్ మృతితో కన్నడ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దర్శకుడు తరుణ్ సుధీర్ ట్విట్టర్‌లో తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న యాంకర్, మంచి మనిషి చందన్ ఇకలేదు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి అని ఆయన ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X