twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rashmika Mandanna ఓవరాక్షన్.. అలాంటి హీరోయిన్‌తోనా? రిషబ్ శెట్టి దిమ్మతిరిగే జవాబు

    |

    పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకొన్న హీరోయిన్ రష్మిక మందన్న ఆ తర్వాత నేషనల్ క్రష్‌గా మారింది. కన్నడ భాషలో కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా మారింది. పుష్ప తర్వాత బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు పలు ఆఫర్లతో కెరీర్‌ను ముందుకు వెళ్తున్నది. అయితే ఇటీవల హిందీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి గురించి ప్రస్తావించకుండా కొంత ఓవరాక్షన్ చేయడంపై నెటిజన్లతోపాటు రిషబ్ శెట్టి కూడా ఘాటుగా స్పందించాడు. రష్మిక చేసిన ఓవరాక్షన్ వివరాల్లోకి వెళితే..

     రిషబ్ శెట్టి పేరును పలకడానికి నిరాకరణ

    రిషబ్ శెట్టి పేరును పలకడానికి నిరాకరణ

    యాక్టర్‌గా తన కెరీర్ ఎలా ప్రారంభమైందో రష్మిక మందన్న తెలియజేస్తూ.. అందాల పోటీలో ప్రకటన వస్తే.. నేను అందులో పాల్గొన్నాను. ఆ పోటీల్లో స్టేట్ లెవెల్ పోటీల్లో గెలిచాను. దాంతో నా ఫోటోను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. ఆ తర్వాత ఓ సినిమా ప్రొడక్షన్ కంపెనీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది అంటూ రెండు చేతులు పైకి ఎత్తి ఫింగర్స్ క్రాస్ చేసి ఓ రకమైన సైగలతో కిరిక్ పార్టీ ద్వారా ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరును పలకడానికి రష్మిక మందన్న ఇష్టపడలేదనేది వీడియోలో స్పష్టంగా కనిపించింది.

    రష్మికను చీల్చి చెండాడిన నెటిజన్లు

    రష్మికను చీల్చి చెండాడిన నెటిజన్లు

    అయితే తనకు మొదటి ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి గానీ, లేదా రక్షిత్ శెట్టి గురించి గానీ ప్రస్తావించకపోవడంపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. కిరిక్ పార్టీ ద్వారా తనకు కెరీర్ ప్రసాదించిన నిర్మాత, దర్శకుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకపోవడం.. అలాగే తన మొదటి హీరో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పేరును విస్మరించడంపై నెటిజన్లు భగ్గుమన్నారు.

    రష్మిక కంటే.. సమంత ఫెర్పార్మెన్స్ అంటే ఇష్టం

    రష్మిక కంటే.. సమంత ఫెర్పార్మెన్స్ అంటే ఇష్టం

    అయితే కంతారా మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన రిషబ్ శెట్టి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న హీరోయిన్లు రష్మిక మందన్న, సమంత రుత్ ప్రభులో ఎవరు బెస్ట్ అంటే.. నాకు సమంత ఫెర్ఫార్మెన్స్ అంటే ఇష్టం అని స్పష్టంగా చెప్పారు. అయితే రష్మిక చేసిన పనికే రిషబ్ శెట్టి అలా స్పందించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

    కొత్తవారికే అవకాశం ఇస్తా..

    కొత్తవారికే అవకాశం ఇస్తా..

    బాలీవుడ్‌లో మరో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, రష్మిక, కీర్తీ సురేస్, సాయి పల్లవిలో ఎవరితో పనిచేయాలనుకొంటున్నారని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. నేను ఎక్కువగా స్క్రిప్టును బట్టి హీరోయిన్లను ఎంచుకొంటాను. ప్రధానంగా నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారిని తీసుకొంటాను. ఎందుకంటే వారు ఎక్కువ టాలెంట్ కలిగి ఉంటారు అని రిషబ్ శెట్టి స్పష్టం చేశారు.

    సమంత, సాయిపల్లవి అంటే ఇష్టం

    సమంత, రష్మిక, కీర్తీ సురేష్, సాయిపల్లవిలో ఎవరిని ఎంచుకొంటారని అడిగిన ప్రశ్నకు రిషబ్ శెట్టి సమాధానం ఇస్తూ.. సమంత, సాయిపల్లవితో పనిచేయాలని కోరుకొంటాను. అయితే చేతులు పైకి ఎత్తి.. ఫింగర్స్ క్రాస్ చేసే కొందరు హీరోయిన్ల (రష్మిక) అంటే నాకు ఇష్టం ఉండదని గట్టిగా సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

    రష్మిక మందన్న కెరీర్ ఇలా..

    రష్మిక మందన్న కెరీర్ ఇలా..

    రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్ బై చిత్రంలో నటించింది. బాలీవుడ్‌లో మిషన్ మజ్ను, యానిమల్ సినిమాల్లో నటిస్తున్నది. ఇక తమిళంలో వారిసు చిత్రంలో విజయ్ సరసన నటించింది. పుష్ప 2 సినిమా షూటింగులో బిజీగా ఉంది.

    English summary
    Heroine Rashmika Mandanna ignores Rishab Shetty's Kirik Party offer in latest interview in Mumbai. In this juncture, Rishab Shetty gives befitting reply to Rashmika Mandanna Comments on Kirik Party offer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X