భార్యను వదిలేసి కాంతార హీరోయిన్‌తో యంగ్ హీరో అక్రమ సంబంధం.. ఆ హిరో వైఫ్‌పై సప్తమి గౌడ రివర్స్ కేసు!

ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమ .. వివాహేతర సంబంధాలు, హత్యలు, విడాకుల చుట్టూ తిరుగుతోంది. స్టార్ హీరో దర్శన్ ఓ హత్య కేసులో చిక్కుకోగా.. అతగాడి అక్రమ సంబంధం బయటకొచ్చింది. ప్రేయసి కోసం లక్షలాది మంది అభిమానులు పూజించే ఓ నటుడు హంతకుడిగా మారి అధ: పాతాళానికి దిగజారిపోయాడు. సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే దర్శన్ వ్యక్తిగత జీవితం వివాదాలమయం. ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్యను , కన్నబిడ్డను వదిలేసి చివరికి హత్యకు కూడా వెనుకాడని వైనం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తన మంచి కోసం తాపత్రాయపడిన అభిమానిని కడతేర్చిన దర్శన్, అతని ప్రియురాలు చివరికి ఊచలు లెక్కపెడుతున్నారు.

చట్ట ప్రకారం వెళ్లి ఉంటే.. ఇన్ని సమస్యలు ఎదురయ్యేవి కావన్న మాట వినిపిస్తోంది. ఇది దారుణమని, దర్శన్‌ని కఠినంగా శిక్షించాలంటూ .. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ ధర్నాలు చేయడం విడ్డూరం. ఒక్క దర్శన్ మాత్రమే కాదు.. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎందరో నటీనటుల జీవితాల్లోని చీకటి కోణాలు ఎన్నో. వీటిలో బయటపడ్డవి కొన్ని మాత్రమే. ఇన్ని పాడు పనులు చేస్తూ కొందరు తారలు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం మరీ విడ్డూరం. వీరి కోసం అభిమానులు చొక్కాలు చించుకోవడం, రక్తదానాలు, అన్నదానాలు, నాలుకలు కోసుకోవడాలు చేసుకోవడం ఏంటో.

kantara fame sapthami gowda files defamation case as yuva rajkumar wife sridevi Here is the complete story

దర్శన్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతున్న వేళ.. కన్నడ ఇండస్ట్రీలో మరో విడాకులు, అఫైర్ కథ వెలుగులోకి వచ్చింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారతో పాపులర్ అయిన సప్తమి గౌడ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఓ హీరో భార్య విషయంలో ఆమె కోర్టుకెక్కారు. కాంతార బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరుస ఆఫర్లు సప్తమి గౌడ ఇంటికి క్యూకట్టాయి. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'ది వ్యాక్సిన్ వార్'లోనూ సప్తమి గౌడ నటించగా.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో సౌత్, నార్త్‌లలో ఆమెకు క్రేజ్ పెరిగింది. మాతృభాష కన్నడతో పాటు తెలుగులోనూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే దివంగత కన్నడ నట దిగ్గజం రాజ్ కుమార్ కుటుంబానికి చెందిన యువరాజ్ కుమార్‌తో సప్తమి ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలు శాండిల్‌వుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం కాస్త యువరాజ్ భార్య శ్రీదేవికి తెలియడంతో ఆమె భగ్గుమంది. తనను భర్త వేధిస్తున్నాడంటూ విడాకులు కోరింది. దీనికి కౌంటర్‌గా యువరాజ్ సైతం.. తన భార్య తనను వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాల్సిందిగా ఫ్యామిలీ కోర్ట్ ‌ను ఆశ్రయించారు. ఈ పరిణామాలపై శ్రీదేవి స్పందిస్తూ.. సప్తమి గౌడతో తన భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. తను అమెరికా వెళ్లినప్పుడు యువరాజ్ - సప్తమి గౌడ కలిసి జీవించారని , ఇప్పుడు సప్తమి కోసం తనను బయటకు నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

kantara fame sapthami gowda files defamation case as yuva rajkumar wife sridevi Here is the complete story

కన్నడ పరిశ్రమలో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో సప్తమి కూడా అంతే ఘాటుగా స్పందించారు. శ్రీదేవి తనపై నెగిటివ్ స్టేట్‌మెంట్ ఇచ్చి తన పరువు ప్రతిష్టలకు భంగం కలించేలా వ్యవహరించిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం శ్రీదేవికి నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించింది.

సప్తమి గౌడ కేసు.. యువరాజ్- శ్రీదేవి దంపతుల విడాకుల దరఖాస్తు నేపథ్యంలో కేసు ఎటు నుంచి ఎటు తిరుగుతుందోనని కన్నడ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఇది యువరాజ్‌తో పాటు టోటల్‌గా డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికే తలవొంపులు తెచ్చిపెట్టే అంశం కావడంతో సినీ పెద్దలు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X