కాంతార మరో సంచలన రికార్డు.. ఇండియాలో టాప్ మూవీస్ లో మొదటి స్థానం!

కన్నడ సినిమా కాంతార ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమంలోనే ఏదో మోస్తరుగా ఆడుతుంది అనుకుంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ అందుకుంటూ ఉండటం విశేషం. ఇటీవల కాలంలో వరుసగా కన్నడ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను అందుకుంటున్నాయి. ఇప్పుడు కాంతార సినిమా కూడా కన్నడ చిత్ర పరిశ్రమను ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గర్వపడేలా చేసింది. ఇక ఈ సినిమా రోజుకోరికార్డును అందుకుంటూ ఉండడం విశేషం.

బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో ప్రాఫిట్ కూడా అందించింది. సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ చిత్ర పరిశ్రమంలో విడుదలైన కాంతార సినిమా ఆ తర్వాత మిగతా భాషల్లో విడుదల అయింది. ఇక కన్నడ చిత్ర పరిశ్రమంలోనే ఈ సినిమా 80 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇండియా మొత్తంలో కూడా ఈజీగా 100 కోట్లు దాటేసి సంచలరీ రికార్డును అందుకుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా అందుకునే ఛాన్స్ ఉన్నట్లుగా బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.

Kantara movie another record in IMDB top indian movies list

అయితే ఈ తరుణంలో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఐఎండిబి రేటింగ్స్ ప్రకారం ఈ సినిమా ఇండియా మొత్తంలో నెంబర్ వన్ సినిమాగా చోటు దక్కించుకోవడం విశేషం. లేటెస్ట్ గా విడుదలైన 250 టాప్ రేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్టులో కాంతార సినిమా మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో 1993 లో వచ్చిన రామాయణం సినిమా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక తర్వాత ఇటీవల వచ్చిన రాకెట్రీ మూవీ మూడవ స్థానంలో ఉండగా నాలుగో స్థానంలో నాయకన్ అలాగే ఐదవ స్థానంలో అన్బే శివమ్ సినిమా కొనసాగుతోంది. అలాగే 8వ స్థానంలో ఇటీవల వచ్చిన మరో కన్నడ సినిమా 777 చార్లీ కూడా చోటు దక్కించుకుంది. ఇక కాంతార సినిమా మాత్రం ఐఎండిబి లో నెంబర్ వన్ స్థానంలో నిలిచి కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచింది అని చెప్పవచ్చు. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X