Kantara for Oscars: ఆస్కార్ రేసులో కాంతార.. నిర్మాత అధికారిక ప్రకటన

ఈ మధ్య కాలంలో దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీ నుంచి ఎన్నో ప్రయోగాత్మక కథలతో సినిమాలు తెరకెక్కుతోన్నాయి. వీటికి అన్ని వర్గాల సినీ ప్రియుల నుంచి అదిరిపోయే స్పందన కూడా లభిస్తోంది. ఫలితంగా ఈ తరహాలో వచ్చిన చాలా చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో అలాంటివి మరింత ఎక్కువ సంఖ్యలో రూపొందుతోన్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే 'కాంతార'. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్‌ అవార్డుపై గురి పెట్టింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

కాంతార పాన్ ఇండియా రిలీజ్

కాంతార పాన్ ఇండియా రిలీజ్

ప్రముఖ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి చేసిన సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం సమకూర్చారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు.

400 కోట్లతో కాంతార సెన్సేషన్

400 కోట్లతో కాంతార సెన్సేషన్

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కాంతార' మూవీ ముందుగా కన్నడంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేయడంతో దీన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేశారు. అన్ని చోట్లా భారీ స్పందనను అందుకున్న ఈ సినిమా రూ. 400 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. దీంతో ఇది ఇండియాలోనే ఎక్కువ లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో చేరింది.

ఆస్కార్‌పై ఫోకస్ చేసిన మూవీ

ఆస్కార్‌పై ఫోకస్ చేసిన మూవీ


కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ సినిమాను గ్రామ దేవతల కాన్సెప్టుతో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ మూవీకి ఓటీటీలోనూ అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీ యూనిట్ ఆస్కార్ అవార్డులపై ఫోకస్ చేసినట్లు తెలిసింది.

అకాడమీకి అప్లికేషన్‌... క్లారిటీ

అకాడమీకి అప్లికేషన్‌... క్లారిటీ

2023లో ప్రకటించే 95వ అకాడమీ లేదా ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ను జనవరి 24, 2023న ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'కాంతార' మూవీని కూడా నామినేషన్స్‌లో చేర్చాలంటూ చిత్ర యూనిట్ తాజాగా అకాడమీకి అప్లికేషన్‌ను పంపించింది. ఈ విషయాన్ని 'కాంతార' చిత్ర నిర్మాత విజయ్ కిరంగదుర్ అధికారికంగా ప్రకటించారు.

దాని మీద ఆశతో ఉన్నామని

దాని మీద ఆశతో ఉన్నామని


'కాంతార' మూవీ నిర్మాత విజయ్ కిరంగదుర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'కాంతార కోసం మేము అకాడమీకి అప్లికేషన్‌ను పంపాము. నామినేషన్స్ ప్రకటించేందుకు ఇంకా సమయం ఉన్నందున ఆశాభావంతో ఉన్నాము. కాంతార మూవీకి సంబంధించిన కథ దేశ వ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నాము' అన్నారు.

RRR సక్సెస్.. కాంతార మాత్రం

RRR సక్సెస్.. కాంతార మాత్రం


'కాంతార' మూవీకి ఆస్కార్ అవార్డు కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. అయితే, RRR పలు మార్గాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయింది. అలాగే, ఎన్నో అవార్డులను గెలుచుకుంది. కానీ, 'కాంతార' మాత్రం దేశ వ్యాప్తంగానే ప్రభావాన్ని చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో అకాడమీ దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X