twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో పంజాబ్‌లా కాకూడదు.. డ్రగ్స్ కేసుపై సీఎం స్పెషల్ ఫోకస్!

    |

    ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ కూడా చేశారు. మరీ ముఖ్యంగా రాగిణి ద్వివేది అరెస్ట్ అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక మరో వైపు సంజనా గల్రానీ అసిస్టెంట్ రాహుల్‌ను అరెస్ట్ చేయడంతో ఆమెపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.ఇలా డ్రగ్స్ కేసులో ఇంకా భారీ స్థాయిలో సెలెబ్రిటీలు బయటపడబోతోన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కమ్రంలో కర్ణాటక సీఎం యాడ్యూరప్ప దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

    పంజాబ్‌లా కాకుండా..

    పంజాబ్‌లా కాకుండా..

    ఈ డ్రగ్స్ కేసులో కర్ణాటక రాష్ట్రం పరువు పోతోందని, దాదాపు 85 ఏళ్ల చరిత్ర ఉన్న కన్నడ చిత్ర పరిశ్రమ పరుపు కూడాపోతోందని సీఎం వాపోయారట. రాష్ట్రాన్ని మరో పంజాబ్‌లా మారకుండా కాపాడాలని ఆదేశించినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.

    ప్రతిపక్షాల ఆరోపణలు..

    ప్రతిపక్షాల ఆరోపణలు..

    డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ద్వివేది వీడియోలను, ఫోటోలను ప్రతిపక్షాలు విడుదల చేశారు.అందులో యాడ్యురప్ప కొడుకు విజయేంద్ర (రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్) ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ద్వివేది బీజేపీకి స్టార్ క్యాంపైనర్ అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

    ఎంతో మంది ఉన్నారు..

    ఎంతో మంది ఉన్నారు..


    కన్నడ దర్శకుడు లంకేష్, ప్రశాంత్ సంబర్గి డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడతారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరో నిర్మాత సందేశ్ నాగరజ్ ఇలాంటి కామెంట్లను ఖండించాడు. ఎవరో కొందరు డ్రగ్స్ మాఫియాతో లింక్ అయి ఉండొచ్చు అని తెలిపాడు.

    పెద్ద వాళ్లు బయటకు రావాలి..

    పెద్ద వాళ్లు బయటకు రావాలి..

    అలాంటి వారు ఒక్క శాతం ఉంటారేమో. అంత మాత్రానా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నిందిస్తారా? చిత్ర పరిశ్రమ మొత్తం అలాంటిదే అని ఆరోపిస్తారా? పెద్ద హీరోలు స్టార్ సెలెబ్రిటీలు బయటకు వచ్చి ఈ ఆరోపణలను ఖండించాలని, అమాయకులను కాపాడాలని సందేశ్ నాగరాజు పేర్కొన్నారు.

    English summary
    Karnataka CM Focus On Drugs Case in Sandalwood. Despite the CM’s instructions to his party colleagues not to comment on the ongoing raids, many of them are falling over each other to demand strict action against the drug menace.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X