Karnataka Results.. అందరి చూపు ఆ హీరో మీదే.. ఓడించేందుకు మోదీ, అమిత్ షా భారీగా.. ఏ హీరో ఎవరి కోసమంటే?

కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు రంజుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిక్యత ప్రదర్శిస్తున్నప్పటికీ.. బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందనే విషయం తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలే కాకుండా కన్నడ సినీ ప్రముఖులు కూడా భాగమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్నడ సినీ తారలు భారీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో కొందరు రాజకీయ నేతల గెలుపు ఓటములు ఆసక్తిని రేపాయి. అయితే తాజా ఫలితాల నేపథ్యంలో గెలిచే, ఓడిపోయే సినీ ప్రముఖుల ఎవరనే వివరాల్లోకి వెళితే..

కన్నడ ఎన్నికల్లో సినీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. పలు పార్టీలు తమ గెలుపు, ఓటముల కోసం స్టార్ హీరోలు, హీరోయిన్లను రంగంలోకి దించాయి. ఎండనకా, వాననకా సినీ తారలు తాము మద్దతు తెలిపే పార్టీల కోసం శ్రమించారు. హీరోలు దర్శన్, సుదీప్, శివరాజ్‌కుమార్, ధ్రువ్ సర్జా, దునియా విజయ్, హీరోయిన్ రమ్య లాంటి తారలు రాజకీయ వేదికలపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కన్నడ సినీ తారలే కాకుండా పరభాష నటులు కూడా ఈ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నించారు.

 modiamithsaha

చిక్ మంగళూరు అభ్యర్థి సుధాకర్ కోసం సినీ తారలందరూ కష్టపడ్డారు. తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మనందం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అందర్నీ ఆకట్టుకొన్నది. కే సుధాకర్ కోసం బ్రహ్మనందం మాత్రమే కాదు.. దర్శన్, సుదీప్ లాంటి హీరోలు కూడా భారీగా ప్రచారం చేశారు. ఇలా తమ అభిమాన నాయకుల కోసం చిన్న, చితకా నటీనటులు భారీగా ప్రచారం చేసి గెలుపు కోసం కృషి చేశారు.

కన్నడ రాజకీయాలు సినీ తారల స్నేహానికి చిచ్చు పెట్టేలా చేశాయి. నిర్మాత ఉమాపతి, హీరో దర్శన్ క్లోజ్ ఫ్రెండ్స్. ఉపాపతికి వ్యతిరేకంగా దర్శన్ ప్రచారం చేయాల్సి వచ్చింది. ఉమాపతికి వ్యతిరేకంగా నిలబడిన పోటీ చేసిన సతీష్ రెడ్డికి దర్శన్ బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఓ దశలో దర్శన్‌పై ఉమాపతి తన ప్రచారంలో విమర్శలు కూడా చేయాల్సి వచ్చింది. అయితే దర్శన్ ప్రచారం ఒక్క పార్టీకి పరిమితం కాలేదు. అన్ని పార్టీల్లో ఉన్న తన స్నేహితులకు ప్రచారం చేశారు. ఇక సిద్దరామయ్య కోసం వరుణలో శివన్న ప్రచారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

nikilkumaraswamy

కర్ణాటకలో రామనగర నియోజక వర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ స్థానం నుంచి మాజీ సీఎం, మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేయడం తెలిసిందే. అయితే రామనగర నియోజకవర్గంలో ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి నేతలు భారీగా ప్రచారం చేశారు. అయితే నిఖిల్ కుమారస్వామి గెలుపు కోసం చాలా కష్టపడుతున్నట్టు తాజా సమాచారం.

హీరో ధ్రువ సర్జా పార్టీలకు సంబంధం లేకుండా తన స్నేహితుల కోసం ప్రచారం చశారు. అరకలగుడు నియోజకవర్గంలో కృష్ణ గౌడకు మద్దతుగా ప్రచారం చేశాడు. హీరోయిన్ రమ్య కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్దరామయ్య విజయం కోసం శ్రమించారు. సుదీప్ పలు ప్రాంతాల్లో బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X