Shiva Rajkumar's Ghost.. 6 కోట్లతో భారీ సెట్.. పాన్ ఇండియా మూవీగా ఘోస్ట్!
కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ నటించిన పాన్ ఇండియా మూవీ 'ఘోస్ట్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి కన్నడ బ్లాక్ బస్టర్ బీర్బల్ ఫేమ్ శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్‌లో పోస్టర్ ఆకట్టుకుంటున్నది. భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇక్కడ 24 రోజులపాటు భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేయనున్నారు. నవంబర్ 10 కి మొదటి షెడ్యుల్ పూర్తవుతుంది. డిసెంబర్‌లో రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

ఘోస్ట్ చిత్రానికి మస్తీ, ప్రసన్న వీఎం డైలాగ్స్ అందిస్తున్నారు. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడలో టాప్ స్టార్స్, టెక్నిషన్స్‌తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ఘోస్ట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
నటీనటులు: డాక్టర్ శివరాజ్ కుమార్
ప్రొడక్షన్: సందేశ్ ప్రొడక్షన్స్ (29వ చిత్రం)
డైరెక్టర్: శ్రీని (బీర్బల్)
సినిమాటోగ్రఫి: మహేంద్ర సింహ
మ్యూజిక్: అర్జున్ జన్య
ఆర్ట్: శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
పబ్లిసిటీ, పీఆర్వో: బిఏ రాజు'స్ టీం


Click it and Unblock the Notifications











