నగ్నంగా డ్యాన్స్..చీప్ పబ్లిసిటీ కోసమే వీడియో.. సంయుక్త హెగ్డేపై ఆరోపణలు

కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే (కిరాక్ పార్టీ ఫేమ్), ఆమె స్నేహితులపై పార్క్‌లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్రా ధరించి వర్కౌట్లు చేసుకుంటూ ఉంటే ఓ లేడీ వచ్చి దూషించిందని, దాడి చేసిందని సంయుక్త హెగ్డే షేర్ చేసిన వీడియోతో ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే వీటిపై సంయుక్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

తన ఫ్రెండ్స్‌పై దాడి చేశారని, డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని తన గ్యాంగ్‌తో కలిసి ఆమె బెదిరించింది అంటూ ఫిర్యాదు చేసింది. అయితే సంయుక్త హెగ్డేపై దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ నేత కవితా రెడ్డి. ఆమె ఈ ఘటనపై స్పందించిన సంయుక్తపై ఆరోపణలు చేసింది.

పార్క్‌లో అలా..

పార్క్‌లో అలా..

పార్క్‌లో ఎవరో ముగ్గురు ఆడవాళ్లు అల్లరి చేస్తున్నారు.. పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని నన్ను పిలిచారు. నేను అక్కడికి వెళ్లేసరికి పెద్ద పెద్ద అరుపులుకూడా వినిపిస్తున్నాయి అని కాంగ్రెస్ నేత కవితా రెడ్డి చెప్పుకొచ్చింది.

నగ్నంగా డ్యాన్స్..

అయితే సంయుక్త హెగ్డే షేర్ చేసిన వీడియోల్లో నగ్నంగా డ్యాన్స్ చేస్తున్నారని కవితా రెడ్డి ఆరోపించినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో సంయుక్త కూడా స్పందించింది. నగ్నంగా కాదు.. స్పోర్ట్స్ బ్రా ధరించి వర్కౌట్లు చేస్తున్నామని లైవ్‌లోనే టీ షర్ట్ విప్పి చూపించింది.

ఆమె డ్రెస్ గురించి..

ఆమె డ్రెస్ గురించి..

ఆమె ధరించిన డ్రెస్ గురించి నేను అస్సలు కామెంట్ చేయలేదు. ఎందుకంటే నేను కూడా షార్ట్స్ వేసుకుని పార్క్‌లో వాకింగ్‌కు వెళ్తాను. ఏ డ్రెస్ ధరించి రావాలి అని అక్కడ ప్రత్యేకంగా ఎలాంటి రూల్స్ లేవు అంటూ కవితా రెడ్డి చెప్పుకొచ్చింది. అయితే వారే మొదటగా దూర్భాషలాడటంతో టెంపర్ కోల్పోయాను అందుకే కొట్టానని వివరణ ఇచ్చుకుంది.

చీప్ పబ్లిసిటీ..

చీప్ పబ్లిసిటీ..

నేను విక్రమ్ హెగ్డే చేస్తోన్న ట్రోల్స్ గురించి బాధపడటం లేదు.. సంయుక్త హెగ్డే ట్రోల్స్ గురించి ఆలోచిస్తున్నాను. చీప్ పబ్లిసిటీ కోసం ఆమె ఆ వీడియోను చేసింది. పబ్లిసిటీ కోసమే అలా చేసిందని క్లియర్ కనిపిస్తుంది అంటూ కవిత ఆరోపించింది. కానీ దేశ వ్యాప్తంగా కవితకు వ్యతిరేకంగా ట్రెండ్ నడుస్తోంది.

సంయుక్త అలా..

సంయుక్త అలా..

నిన్నటి ఘటనను తలుచకుంటూ సంయుక్త ఎమోషనల్ అయింది. ఎలాంటి దుస్తులు వేసుకున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారంటూ మహిళలను కించపరిచడం ఆపండి. నేను ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశాను. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందనే నమ్మకం నాకుంది. మాలా మేము ఉండటానికి ఓ మంచి సమాజం ఏర్పడుతుందని ఆశపడుతున్నా అంటూ సంయుక్త ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X