For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడిని పెళ్లాడిన టెలివిజన్ నటి రష్మీ.. అతికొద్ది మందికే ఆహ్వానం.. ఎందుకంటే?

  |

  బుల్లితెరపై పౌర్ణమి, కావ్యాంజలి టెలివిజన్ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న రష్మీ ప్రభాకర్ తన ప్రియుడిని వివాహం చేసుకొన్నది. పెళ్లి తర్వాత దిగిన సెల్పీతో తన పెళ్లి వార్తను అభిమానులకు అందించింది. కొద్దికాలంగా నిఖిల్ భార్గవ్‌తో అఫైర్‌లో ఉన్న రష్మీ ప్రభాకర్.. కొద్ది రోజుల క్రితం ఇరు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించడంతో పెళ్లికి మార్గం సుగమమైంది. రష్మీ ప్రేమ, పెళ్లి విషయాల్లోకి వెళితే..

   గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం

  గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం


  గతేడాది నవంబర్‌లో తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేస్తూ.. తన ప్రేమ కథను అభిమానులతో పంచుకొన్నది. నిఖిల్ భార్గవ్‌తో ఎలా ప్రేమలో పడింది. తన జీవితానికి సరిపోయే మిస్టర్ పర్‌ఫెక్ట్ చేసిన ప్రపోజల్, ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎలా తమ జీవితం కొనసాగింది అనే విషయాలను పూసగుచ్చినట్టు చెప్పింది.

   నిఖిల్‌తో పరిచయం అలా..

  నిఖిల్‌తో పరిచయం అలా..


  నిశ్చితార్థం తర్వాత రష్మీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. నిఖిల్ భార్గవ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తారు. మూడేళ్ల క్రితం ఓ ఈవెంట్‌లో నేను డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళితే.. అక్కడ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నిఖిల్‌ను కలిశాను. తొలుత మా మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత మా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. ఆ తర్వాత రోజు నిఖిల్ నాకు ప్రపోజ్ చేశాడు అని రష్మీ ప్రభాకర్ తెలిపింది.

  లాక్‌డౌన్‌లో కలిసి ప్రజలకు సేవ

  లాక్‌డౌన్‌లో కలిసి ప్రజలకు సేవ


  నిఖిల్ ప్రపోజ్ చేసిన తర్వాత చాలా ఆలోచించాను. మేమిద్దరం లాక్‌డౌన్ సమయంలో మేమిద్దరం పేదలకు ఆహార పదార్థాలు పంచే బాధ్యతను తీసుకొన్నాం. కలిసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాం. మా ఇద్దరి గురించి ఇరు కుటుంబాల్లో బాగా తెలిసింది. దాంతో నిఖిల్ ప్రపోజ్‌ను అంగీకరించాను. ఆ తర్వాత మా రిలేషన్ గురించి నా తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా సరే అన్నారు. దాంతో మా ప్రేమ మరో లెవెల్‌కు వెళ్లింది అని రష్మీ తెలిపింది.

   నిఖిల్ కరెక్ట్ సహజీవిత భాగస్వామి

  నిఖిల్ కరెక్ట్ సహజీవిత భాగస్వామి


  నా ప్రొఫెషన్‌ను నిఖిల్ పూర్తిగా అర్ధం చేసుకొంటాడు. ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో అతడికి పూర్తిగా తెలుసు. పెళ్లి తర్వాత కూడా నేను నటించడానికి ఆయనకు అభ్యంతరం లేదు. నన్ను నటిగా కొనసాగమని ప్రోత్సహిస్తున్నాడు. అందుకే అతడే నాకు సహభాగస్వామి అని నమ్మాను. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం అని రష్మీ వెల్లడించింది.

  ఏప్రిల్ 25న రష్మీ, నిఖిల్ వివాహం

  ఏప్రిల్ 25న రష్మీ, నిఖిల్ వివాహం


  రష్మీ వివాహం నిఖిల్‌తో ఏప్రిల్ 25వ తేదీన బెంగళూరులో ఘనంగా జరిగింది. తోటి కళాకారులు, నటులు, సినీ ప్రముఖులు భారీగా రష్మీ ప్రభాకర్ వివాహానికి హాజరయ్యారు. అయితే కోవిడ్ పరిమితుల వల్ల ఎక్కువ మందిని ఆహ్వానించలేదని తెలిసింది. నిఖిల్, రష్మి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, సెల్పీలను స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం రష్మీ పెళ్లి ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.

  రష్మీ ప్రభాకర్ యాక్టింగ్ కెరీర్ ఇలా..

  రష్మీ ప్రభాకర్ యాక్టింగ్ కెరీర్ ఇలా..


  రష్మీ ప్రభాకర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. శుభ వివాహ సీరియల్‌లో నటించడం ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించంది. ఆతర్వాత మహాభారతంలో ధుర్యోధనుడి చెల్లెలి పాత్ర ద్వారా కన్నడలో విశేషంగా అభిమానులను సంపాందించుకొన్నారు. ఆతర్వాత తెలుగులో పౌర్ణమి, తాజాగా కావ్యాంజలి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కన్నడలో బీబీ5, మహాకావ్య అనే చిత్రాల్లో కూడా నటించారు.

  English summary
  Telugu and Kannada television actress Rashmi Prabhakar has tied the knot with Nikhil Bhargav on April 25 in Bengaluru. Very few from Industry and family members, friends and well-wishers attends the Rashmi marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion