KGF 2 స్టోరీ లీక్: హీరో పాత్ర లేనట్లే.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?
నేషనల్ వైడ్ గా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన మొదటి కన్నడ సినిమా KGF 1. ఆ సినిమాతో కథానాయకుడు యష్ స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. తెలుగు తమిళ్ అని తేడా లేకుండా బాలీవుడ్ లో సైతం ఈ యాక్షన్ మూవీ సాలీడ్ కలెక్షన్స్ ని అందుకుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ప్రపంచం వ్యాప్తంగా ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన లికేజ్ న్యూస్ లు కొన్ని హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

కథలో మరో ట్విస్ట్..
కేజీఎఫ్ మొదటి పార్ట్ లో ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరు ఊహించని విధంగా మనసుకు హద్దుకునేలా ప్రజెంట్ చేశాడు. ఇక అదే తరహాలో సెకండ్ పార్ట్ కూడా అంతకు మించిన ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఆడియెన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. కథలో ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అద్బుతంగా ఉంటుందని తెలుస్తోంది.

అధీరా వస్తే.. వెన్నులో వణుకు..
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించిన విలన్స్ ని చూపించి హీరో స్థాయిని తెలియకుండానే పెంచేశారు. ఇక KGF లాంటి పెద్ద కథలో మెయిన్ విలన్ ఎలా ఉండాలో మన ఊహలకు అందదు. అందుకే ప్రశాంత్ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ని అధీరా పాత్ర కోసం ఎంచుకున్నాడు. అతను మొదటి సీన్ తోనే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేలా ఎంట్రీ వస్తాడని తెలుస్తోంది. ఇక ఎవరినైనా ఎదుర్కొనే రాకీ భాయ్ అతనితో ఎలా తలపడతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

క్లయిమ్యాక్స్ లో విషధాకరమైన ఎండింగ్..
నిజానికి ఇది కాస్త ఇబ్బంది పెట్టె వార్తే.. ఎంతవరకు నిజమో తెలియదు గాని రాకీ భాయ్ మరణంతోనే సినిమా మూడ్ చేంజ్ అవుతుందట. గరుడ మరణాంతరం సామ్రాజ్యాన్ని తన అధీనంలోకి తెచ్చుకునే రాకీ భాయ్ కి అప్పుడే శత్రువులకు హెచ్చరిక పంపిస్తాడు. కథలో ప్రైమ్ మినిష్టర్ పాత్ర రైమికా సేన్ (రవీనా తండోన్) ఇండియన్ బిగ్గెస్ట్ క్రిమినల్స్ లో ఒకరైన రాకి భాయ్ ని అంతం చేయాలని డెత్ వారెంట్ జారీ చేస్తుంది. ఆ సీన్ తో కథ మరో లెవెల్ కి వెళుతుందట.
Recommended Video

రాకీ బాయ్ కి మరణమే?
రాకీ భాయ్ తన అర చేతుల్లోకి తెచ్చుకున్న KGF సామ్రాజ్యాన్ని లాక్కోవడానికి చాలా మంది విలన్స్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారట. మెయిన్ గా సూర్యవర్ధన్ బ్రదర్ అధీరా నుంచి రాకీ ఎదుర్కొనే ఎదురుదెబ్బలు మాములుగా ఉండవని తెలుస్తోంది. మరోవైపు గర్ల్ ఫ్రెండ్ ఫాదర్ కమల్ గురు పాండియన్, అలాగే ఆండ్రూ, ఇనాయత్ ఖాళీల్ వంటి వారు రాకీ ని స్పెషల్ గా టార్గెట్ చేస్తారట. ఏదేమైనా అంతిమంగా సాడ్ ఎండింగ్ నోట్ తో KGF 2 ముగుస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











