అధీరాగా సంజయ్ దత్: కెజిఎఫ్ 2 లుక్ అదిరిపోయింది
Recommended Video
కేజీఎఫ్ -2 మూవీలో అధీరా పాత్రకు సంబంధించిన సస్సెన్స్ వీడింది. సినిమాలో అతి కీలకమైన విలన్ పాత్రలో కనిపించే నటుడు ఎవరు? అనేది వెల్లడిస్తూ చిత్ర బృందం సోమవారం పోస్టర్ విడుదల చేశారు. ఇందులో అధీరా పాత్రలో బాలీవుడ్ సంజయ్ దత్ కనిపించబోతున్నారు. లేటెస్ట్ పోస్టర్ చూస్తుంటే సంజయ్ ప్రేక్షకులను భయపెట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది.
కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కెజిఎఫ్-1' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ 'కెజిఎఫ్ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కెజిఎఫ్ స్టోరీలో అధీరా పాత్ర ఏమిటంటే...
మొదటి భాగంలో గరుడ ఆధ్వర్యంలో కెజిఎఫ్ మైన్స్ నడుస్తుంటాయి. అయితే గరుడను చంపడానికి బయటి నుంచి చాలా మంది ప్రయత్నించి విఫలం అవుతారు. ఆ సమయంలో రాఖీ(యష్)ని రంగంలోకి దింపి అతడిని చంపిస్తారు. దీని వెనక ఉన్న వ్యక్తి అధీరా.... మొదటి భాగంలో అధీరా పాత్ర పెద్దగా కనిపించదు. రెండో భాగంలో సంజయ్ దత్ రూపంలో అధీరా పాత్ర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అధీరా వర్సెస్ రాఖీ భాయ్
రెండో భాగం అంతా కూడా అధీరా vs రాఖీ భాయ్ పోరాటం నేపథ్యంలో సాగుతుందని స్పష్టమవుతోంది. కేవలం గరుడను చంపి ముంబై ఏరియాకు డాన్ అవుదామనుకున్న రాఖీ భాయ్.... కెజిఎఫ్ గురించి తెలుసుకున్న తర్వాత దీనికి బాస్ కావాలని డిసైడ్ అవుతాడు. అధీరాను రాఖీ భాయ్ ఎలా ఓడిస్తాడు, ఈ సామ్రాజ్యాన్ని ఎలా సొంతం చేసుకుంటాడు అనేది చాప్టర్ 2లో చూపించే అవకాశం ఉంది.

సంజయ్ దత్ సాండల్ వుడ్ ఎంట్రీ
'కెజిఎఫ్ 2' ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. 'అధీరా' పాత్ర సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంటుందట. సంజయ్‌తో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

కెజిఎఫ్
'కెజిఎఫ్' సాండల్ వుడ్ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అక్కడ వంద కోట్ల రికార్డు కూడా ఒక్కటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కిరంగదూర్ నిర్మాత.


Click it and Unblock the Notifications











