Yash : టాక్సిక్‌తో యశ్ రేర్ ఫీట్.. రాకీ భాయ్ కోసం జాన్ విక్, డ్యూన్ 2 టీమ్
భారతీయ చిత్ర పరిశ్రమలో హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమలదే హవా. పేరుకు దేశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు తయారవుతున్నా.. సినిమాల నిర్మాణ, బడ్జెట్, మార్కెట్ పరిధి, వసూళ్లు ఈ మూడు పరిశ్రమలవే. ప్రస్తుతం టాలీవుడ్.. భారతీయ సినీ పరిశ్రమను రూల్ చేస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన తెలుగు సినిమా మరిన్ని ఇండస్ట్రీలకు ఆదర్శంగా నిలిచింది. అలా టాలీవుడ్ నుంచి స్పూర్తిని పొందింది కన్నడ ఇండస్ట్రీ.
దేశంలోని టాప్ హీరోయిన్స్, దర్శకుల్లో మెజారిటీ కన్నడ వాళ్లే అయినా ఎందుకో శాండిల్‌వుడ్ వెనుకబడి పోయింది. తమ పరిధిలోనే చిన్నాచితకా సినిమాలు తీసుకుంటూ బండిని లాక్కొస్తోన్న కన్నడ సీమకు ఊపు తెచ్చింది కేజీఎఫ్ సిరీస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యువ హీరో యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2లు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ సినిమాలో హీరో ఎలివేషన్, స్క్రీన్ ప్లే, సంగీతం, యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్‌ను ఊపేశాయి. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాను చాటి చెప్పాయి. ప్రశాంత్ నీల్, యశ్‌లు ఇండియాలో మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు.

పాన్ ఇండియా స్టార్‌గా మారాక యశ్ నటిస్తున్న చిత్రం టాక్సిక్.. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ట్యాగ్ లైన్. ఆయన నుంచి ఎప్పుడు సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వేళ్ల దాదాపు రెండున్నరేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాలో నటిస్తున్నారు యశ్. అదే టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యశ్ సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే టోవినో థామస్, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యశ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే సాంకేతిక కారణాలతో కొత్త తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టాక్సిక్ మూవీకి సంబంధించి ఓ క్రేజ్ న్యూస్ బయటికి వచ్చింది.

ఈ సినిమాను ఒకేసారి రెండు భాషల్లో షూట్ చేయనున్నారు. కన్నడతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తద్వారా భారతదేశంలో ఇంగ్లీష్, కన్నడ భాషల్లో షూట్ చేసుకోనున్న తొలి చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. గతంలో గైడ్, షాలిమార్ సినిమాలను హిందీ , ఇంగ్లీష్‌లో.. నథింగ్ బట్ లైఫ్ అనే సినిమాను ఇంగ్లీష్, మలయాళంలో.. సమ్మర్ హాలిడేస్ అనే మూవీని ఇంగ్లీష్, కన్నడలలో ఒకేసారి షూట్ చేశారు. అయితే పై సినిమాలేవి భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్‌తో తీసిన సినిమాలు కావు. కానీ ఇప్పుడు టాక్సిక్ ఆ ఘనత దక్కించుకోనుంది. మరి యశ్ ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ తో ఏ రేంజ్‌లో అలరిస్తారో చూడాలి.
ఇదిలా ఉండగా, టాక్సిక్ సినిమా కోసం ఇంటర్నేషనల్ రేంజ్ స్టోరీని క్రియేట్ చేయాలనుకొన్నాం. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కన్నడ, ఇంగ్లీష్ భాషలో షూట్ చేస్తున్నాం. ఈ సినిమా భాషలు, సాంస్కృతిక భేదాలను దాటి అందరి హృదయాలను తాకేలా ఉంటుంది అని దర్శకురాలు గీతూ మోహన్ దాస్, నిర్మాత నిర్మాత వెంకట్ నారాయణ అన్నారు.
జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలకు పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జెజె పెర్రీ, విజువల్ ఎఫెక్ట్స్ కోసం డ్యూన్: పార్ట్ 2 సినిమాకు బీఏఎఫ్టీఏ అవార్డు గెలుచుకున్న DNEG స్టూడియో నిపుణులు పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











