Don't Miss!
- News
కోటంరెడ్డి ఆరోపణల్ని తోసిపుచ్చిన బాలినేని, కాకాణి- ఇన్ ఛార్జ్ కోరిన తమ్ముడు !
- Lifestyle
ప్రసవం న్యాచురల్ గా జరగాలంటే ఎలాంటి ఆహారాలు తినాలో మీకు తెలుసా?
- Finance
Economic Survey: ఆర్థిక సర్వేలో వెల్లడైన సవాళ్లు.. ఎదుర్కొంటామని నిర్మలమ్మ ధీమా..!
- Sports
Archana Devi: ప్రపంచకప్ గెలిచిన ‘మంత్రగత్తె’బిడ్డ! ఇంట్లో నీళ్లు కూడా తాగని వారు..!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
3000 కోట్లతో కేజీఎఫ్, కంతారా నిర్మాతల భారీ ప్లాన్.. వచ్చే 5 ఏళ్లలో దిమ్మతిరిగే ప్రణాళిక
కన్నడ సినీ పరిశ్రమకు సంబంధించి 2022లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చిత్రాలను అందించిన సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. కేజీఎఫ్2, కాంతార చిత్రాలతో భారీ విజయాలను అందుకొన్నది. కేవలం హిట్ చిత్రాన్ని అందించడమే కాకుండా వినూత్నమైన కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. గతేడాది అండగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. భవిష్యత్ 5 సంవత్సరాల కార్యాచరణను ప్రకటించింది. ట్విట్టర్‌లో ఒక ఎమోషనల్ సందేశాన్ని పోస్టు చేస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతేడాది మీరు ఎనలేని ప్రేమను, సపోర్టును అందించారు. మాపై ఊహించని ప్రేమను కురిపించారు. మీ ప్రేమ, సపోర్ట్ లేకపోతే మేము అద్బుతమైన చిత్రాలను అందించడం అసాధ్యంగా ఉండేది. ప్రేక్షకులతో మా అనుబంధం ఇలానే కొనసాగుతూ.. సినీ పరిశ్రమలో అనేక మైలురాళ్లను నెలకొల్పాలని కోరుకొంటున్నాం అని హోంబలే ఫిల్మ్స్ తమ సందేశంలో తెలిపింది.

సినిమా వినోద సాధనం. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మా సినిమాలను చూసి ఆదరించడమే కాకుండా మా ప్రయత్నాలను ప్రశంసించారు. చెడు రోజులైనా, మంచి రోజులైనా మాకు ఉపశమనం, ఆనందాన్ని సినిమా ఇచ్చింది. ప్రపంచానికి మన సంస్కృతి, సంప్రదాయలు, చరిత్రను చెప్పడానికి సినిమాను సాధనంగా ఉపయోగించుకొంటాం అని హోంబలే తెలిపింది.
భారత దేశం భిన్నత్వంతో కూడిన దేశం. యువతను, దేశానికి స్పూర్తిని నింపే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రేక్షకులకు అందించే అవకాశం సినిమా ద్వారా లభించింది.
On behalf of @HombaleFilms, I wish to extend my heartfelt greetings for the new year and appreciate you all for showering unwavering love and support towards us. #HappyNewYear! - @VKiragandur#HombaleFilms pic.twitter.com/h5vXMsaMWP
— Hombale Films (@hombalefilms) January 2, 2023
గతేడాది లభించిన ఉత్సాహంతో కొత్త సంవత్సరంలో భారీ ప్రణాళికలతో సిద్దమవుతున్నాం. అద్బుతమైన కంటెంట్‌తో మీ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేశాం. మా ప్రణాళికల్లో భాగంగా 3000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకొన్నాం. రాబోయే 5 ఏళ్లలో వినోదరంగంలో అనేక మైలురాళ్లను అధిగమించేందుకు ప్లాన్ చేసుకొన్నాం అని హోంబలే ప్రత్యేక ప్రకటనలో తెలిపింది.