‘కెజిఎఫ్’పై మాట మార్చారు: అమేజాన్ ప్రైమ్‌కు చుక్కలు చూపిన ఫ్యాన్స్!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన 'కెజిఎఫ్' కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలై సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరి వారంలో విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 240 కోట్లు వసూలు చేయడంతో పాటు... కన్నడలో 100 కోట్ల వసూళ్లు దాటిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది.
'కెజిఎఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమేజాన్ ప్రైమ్ సంస్థ దక్కించున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆ సంస్థ రూ. 18 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. కన్నడ చిత్ర సీమలో రూపొందిన ఒక సినిమాకు ఇంత భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ రావడం ఇదే తొలిసారి.
కాగా... 'కెజిఎఫ్' రిలీజ్ విషయంలో అమేజాన్ ప్రైమ్ సంస్థ చేసిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

5000 రీట్వీట్స్ చేస్తే...
5000 రీ ట్వీట్స్ చేస్తే వెంటనే ‘కెజిఎఫ్' చిత్రాన్ని విడుదల చేస్తామంటూ అమేజాన్ ప్రైమ్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసింది. అయితే కొన్ని గంటల్లోనే 5వేల రీట్వీట్స్ రీచ్ అయ్యాయి. ఇచ్చిన మాట ప్రకారం సినిమా విడుదలవుతుందని ఎదురు చూసిన అభిమానులకు ఊహించని అనుభవం ఎదురైంది.
అమేజాన్ ప్రైమ్ మాట మార్చింది, అభిమానులు రెచ్చిపోయారు
ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ ఉంటే బావుండేది. వాస్తవానికి 5 వేల రీట్వీట్స్ చేస్తే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పాలనుకున్నాం... మిస్టేక్ జరిగింది అంటూ ప్రైమ్ సంస్థ మాట మార్చింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. బ్యాన్ అమేజాన్ ప్రైమ్ అనే యాష్ ట్యాగ్‌తో విరుచుకుపడ్డారు.
ట్రోల్ చేస్తూ చుక్కలు చూపించారు
మాట తప్పడంతో ట్విట్టర్లో అమేజాన్ ప్రైమ్ సంస్థను ఓ ఆట ఆడుకుంటూ చుక్కలు చూపించారు. నెటిజన్లు, సినీ అభిమానుల ఆగ్రహంతో దిగి వచ్చిన ప్రైమ్... ఫిబ్రవరి 5న ‘కెజిఎఫ్' చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో విడుదల చేయబోతున్నట్లు ప్రటించింది.

కెజిఎఫ్
'కెజిఎఫ్' చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 240 కోట్లు వసూలు చేసింది. త్వరలో దీనికి సీక్వెల్‌గా ‘కెజిఎఫ్ చాప్టర్ 2' రాబోతోంది.


Click it and Unblock the Notifications











