twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF Chapter 2 నుంచి మరో అప్‌డేట్: ఖలీల్ పాత్రను రివీల్ చేసిన యూనిట్

    |

    శాండిల్‌వుడ్ స్టార్ హీరో యశ్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'KGF Chapter 1'. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ మూవీ దేశంలోని పలు భాషల్లో విడుదలైంది. అన్నీ చోట్లా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిందీ చిత్రం. అదే సమయంలో జాతీయ అవార్డులను కూడా ఖాతాలో వేసుకుని దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును కూడా దక్కించుకుంది. ఫలితంగా భారీ విజయాన్ని అందుకున్న దీనికి సీక్వెల్‌గా 'KGF Chapter 2‌'ను తీస్తున్నారు.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'KGF Chapter 2‌'లో పలు ఇండస్ట్రీలకు చెందిన నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ అనే యాక్టర్ ఇనాయత్ ఖలీల్ అనే పాత్రను చేస్తున్నాడు. ఈరోజు ఈ నటుడి పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని తాజాగా ఆయన క్యారెక్టర్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ మేరకు కేజీఎఫ్ టైమ్స్ పేరిట ఓ పోస్టర్‌ను వదిలింది. అందులో 'ఇనాయత్ ఖలీల్ అతి పెద్ద సామ్రాజ్యం నారాచి ని ఆక్రమించడానికి ఎవరితో చేతులు కలుపుతాడు'.. 'ఇనాయత్ ఖలీల్ తన బర్త్ డేను ఇండియాలో ఎక్కడో తెలియని ప్లేస్‌‌లో జరుపుకుంటున్నాడట' అంటూ రెండు ఆర్టికల్స్‌ను అందులో ఉంచారు.

     KGF Chapter 2 Inayath Khalil Role Revealed

    భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'KGF Chapter 2‌'లో కేజీఎఫ్‌ను ఆక్రమించుకున్న రాఖీ భాయ్‌కు అధీరా నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనే నేపథ్యాన్ని చూపించబోతున్నారు. ఇందులో అధీరాగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. రవీనా టాండన్ కీలక పాత్రను చేస్తున్నారు. రవి బస్రూర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.

    English summary
    K.G.F: Chapter 2 is Kannada High Budget Film. In This Movie Balakrishna Playing Inayath Khalil Role. Now This Look Revealed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X