Don't Miss!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- News
UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
KGF Chapter 2: యశ్ మరో సంచలన రికార్డు.. ఇండియాలోనే తొలి సినిమాగా చరిత్ర
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో దక్షిణ భారతదేశంలో భారీ పాన్ ఇండియా చిత్రాలు రూపొందుతోన్నాయి. తద్వారా ఇండియన్ సినిమాలో సౌతిండియా ప్రభావం ఎక్కువగా నిరూపిస్తున్నాయి. ఇలా కొన్నేళ్ల క్రితం వచ్చిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీనే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ మూవీకి అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టింది. ఫలితంగా ఇది పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే చిత్ర యూనిట్ దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని తెరకెక్కించారు.
హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!
'కేజీఎఫ్ చాప్టర్ 1' సూపర్ డూపర్ హిట్ అవడంతో.. అదే కాంబినేషన్‌లో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. మొదటి భాగంలో కేజీఎఫ్‌ను సొంతం చేసుకున్న రాఖీ భాయ్‌ను ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇస్తాడు. దీంతో ఈ మూవీ కథ ప్రారంభం అవుతుంది. వీళ్లిద్దరి మధ్య కేజీఎఫ్ కోసం ఎలాంటి పోరాటం జరిగింది అనే నేపథ్యంతో ఈ సినిమా నడిచింది. ఇక, ఇందులో దానికి మించిన ఎలివేషన్ సీన్స్ డిజైన్ చేశారు. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలతో గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ దక్కింది. ఫలితంగా ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే గ్రాస్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే, దాదాపు రూ. 600 కోట్ల షేర్‌ను కూడా రాబట్టింది. అంతేకాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ వందకు వంద శాతం కలెక్షన్లను దాటేసింది. ఫలితంగా అన్ని చోట్ల ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లతో దాదాపు రూ. 240 కోట్లకు పైగా లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో చిత్ర యూనిట్‌తో పాటు యశ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!
యాభై రోజులకు పైగా ఫుల్ రన్‌లో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ ఎన్నో అరుదైన గొప్ప రికార్డులను నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. అదేమిటంటే.. ఈ సినిమాకు ఇప్పటి వరకూ ప్రముఖ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్‌మైషో ద్వారా 17 మిలియన్లు (1.70 కోట్లు) టికెట్లు అమ్ముడు పోయాయట. గతంలో ఏ భారీ సినిమా కూడా ఈ రేంజ్‌లో టికెట్లను సేల్స్ చేయలేకపోయిందని తెలుస్తోంది. ఫలితంగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ దేశంలోనే ఈ మార్కును చేరుకున్న మొట్టమొదటి చిత్రంగా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతూనే ఉంది.
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు.