KGF Chapter 2: ఆ దేశంలోనూ కేజీఎఫ్ రిలీజ్.. మొట్టమొదటి చిత్రంగా గొప్ప రికార్డు

కొంత కాలంగా దక్షిణ భారతదేశంలో సినిమా రేంజ్ క్రమంగా పెరుగుతోంది. దీనికి కారణం తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'బాహుబలి', కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 1' దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించేలా భారీ విజయాలను అందుకోవడమే. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు భారీ ప్రతిష్టాత్మక చిత్రాలు మరిన్ని ఎక్కువ వస్తున్నాయి. అందులో 'కేజీఎఫ్ చాప్టర్ 1' ఒకటి. శాండిల్‌వుడ్‌లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్‌లో అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.

క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' భారీ విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్‌ను తీయాలని చిత్ర యూనిట్ అప్పుడే నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీన్ని ప్రారంభించేశారు. మొదటి భాగంలో కేజీఎఫ్ మొత్తాన్ని తన వశం చేసుకున్న రాఖీ భాయ్‌కు అధీరా రూపంలో ప్రధాన ప్రత్యర్థి రావడంతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా రూపొందిందని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో యశ్ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసి చూపిస్తారట. ఆరంభం నుంచే ఈ చిత్రంపైన కూడా అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మూవీని మరింత గొప్పగా తీస్తున్నారు.

'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అయినా.. అనివార్య కారణాలతో అనుకున్న సమయానికి దీన్ని పూర్తి చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో ఈ సినిమా టాకీ పార్టును కంప్లీట్ చేసేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు. వీటికి సంబంధించిన అన్ని రకాల పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. దీంతో ఈ సినిమాను గత ఏడాదే డిసెంబర్‌లోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

KGF Chapter 2 Release In Italy and Greece

సూపర్ డూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా అత్యధిక ప్రాంతాల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే దీన్ని ఇటలీ, గ్రీస్‌లో దేశాల్లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక, అక్కడ ఈ మూవీని డిస్ట్రిబ్యూషన్ బీబీ1 విడుదల చేయబోతుంది. ఇక, గ్రీస్‌లో విడుదల కాబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియా చిత్రంగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' రికార్డును కూడా క్రియేట్ చేసింది.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక, ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X