For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KGF 2 లో రాకీ భాయ్ తల్లిగా నటించింది ఎవరో తెలుసా.. పర్సనల్ ఫొటోస్ వైరల్

  |

  KGF చాప్టర్ 2 ఉహీంచినట్లే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటిసారి ఒక కన్నడ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో హాట్ టాపిక్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రం హిందీ వెర్షన్ అత్యంత వేగంగా రూ. 250 కోట్ల మార్కును సాదించడం విశేషం. యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో హీరో పాత్రను ఏలివేట్ చేసే అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ మదర్ సెంటిమెంట్ సీన్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక చాప్టర్ 1, చాప్టర్ 2లో తల్లిగా కనిపించిన ఆ నటి ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఒకసారి ఆమె వివరాల్లోకి వెళితే..

   పవర్ఫుల్ సెంటిమెంట్

  పవర్ఫుల్ సెంటిమెంట్

  రాకీ భాయ్ తల్లి పాత్ర సినిమాలో హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె చెప్పిన డైలాగ్స్ హీరో క్యారెక్టర్ ను చాలా పవర్ఫుల్ గా ఎమోషన్స్ తో ముందుకు సాగేలా చేసిన విధానం ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయ్యింది. ఒక తల్లి కోరిక కోసం మంచి డాన్ గా రాకీ బాయ్ ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తోనే దర్శకుడు ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు.

  ఆమె అసలు పేరు

  ఆమె అసలు పేరు


  ఇక ఈ సినిమాలో యష్ తల్లి పాత్రలో నటించిన ఆ నటి గురించి తెలుసుకోవాలని ఓ వర్గం ప్రేక్షకులు ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక ఆ నటి వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు.. అర్చన జోయిస్. ఆమె శిక్షణ పొందిన కథక్ డ్యాన్సర్. ఆమె వివిధ స్టేజ్ షోలలో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే పలు డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది.

   సీరియల్ ద్వారా..

  సీరియల్ ద్వారా..

  KGF సినిమా ముందు వరకు కూడా అర్చన పెద్దగా ఎవరికి తెలియదు. అర్చన జోయిస్ కన్నడ పరిశ్రమలో మహాదేవి సీరియల్‌తో తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది. సీరియల్‌లో తన అద్భుతమైన నటనతో ప్రముఖులను ఆకర్షించింది. ఆ సీరియల్‌ లో ఆమె సుందరి పాత్రలో నటించింది.

  అద్భుతమైన నటనతో..

  అద్భుతమైన నటనతో..

  KGF చాప్టర్ 1లో అర్చన జోయిస్ యొక్క మొదటి చిత్రం. ఆ సినిమాలో హీరో యష్‌తో ఆమెకు ఎటువంటి సన్నివేశాలు లేనప్పటికీ కూడా దాదాపు హీరో రేంజ్ లోనే క్రేజ్ అందుకుంది. తన అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ తో సినిమాలో మంచి ఎమోషన్ ను పండించింది.

  ఆమె భర్త..

  ఆమె భర్త..

  ఇక అర్చన జోయిస్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె శ్రేయాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అతని గురించి అయితే అర్చన ఇంతవరకు పెద్దగా ఏ విషయాన్ని బయటపెట్టింది లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన భర్తతో దిగిన ఫొటోలను నిత్యం షేర్ చేసుకుంటూనే ఉంటుంది.

  తెలుగులో ఆ హీరోలంటే ఇష్టం..

  తెలుగులో ఆ హీరోలంటే ఇష్టం..

  అర్చనకు KGF ద్వారా మంచి క్రేజ్ రావడంతో కేవలం కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. ఇక ఆమెకు తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అని ముఖ్యంగా మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అని ఆయనకు పిల్లలు ఉన్నారు అనగానే మొదట నమ్మలేదు అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్చన వివరణ ఇచ్చింది.

  Read more about: kgf 2 yash యష్
  English summary
  KGF Chapter 2 Rocky Bhai's mother Archana Jois personal information details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion