Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
KGF యూనిట్ నుంచి మరో గుడ్ న్యూస్: సోమవారం అసలైన సర్ప్రైజ్
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది 'KGF Chapter 1'. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో యశ్ హీరోగా నటించాడు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసిన తీరుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, గత ఏడాది ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సైతం యాక్షన్ విభాగంలో ఓ పురస్కారాన్ని అందుకుంది. ఇండియన్ సినిమాపై ఇంత ప్రభావం చూపించిన దీనికి సీక్వెల్ కూడా వస్తుంది.
'KGF Chapter 1' భారీ హిట్ అవడంతో దానికి కొనసాగింపుగా 'KGF Chapter 2'ను కూడా రూపొందిస్తున్నాడు ప్రశాంత్ నీల్. చాప్టర్ 1లో చివర్లో గరుడను చంపి కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకుంటాడు రాఖీ భాయ్. ఇలాంటి సమయంలో అతడికి అధీర రూపంలో మరో శత్రువు పుట్టుకొస్తాడు. అతడిని ఎలా అంతమొందిచాడు అన్న కథతో రెండో భాగం రూపొందుతోంది. ఇందులో అధీరగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం.. తాజాగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
'KGF Chapter 2' షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వివరించారు. అంతేకాదు, హైదరాబాద్ షెడ్యూల్ మొత్తం అదిరిపోయేలా వచ్చిందని కూడా చిత్ర యూనిట్ చెబుతోంది. ఇదిలా ఉండగా, డిసెంబర్ 21 సోమవారం 10:08 గంటలకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు శనివారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. అది 'KGF Chapter 2' విడుదలకు సంబంధించిన న్యూసే అని తెలుస్తోంది. దీంతో అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.