twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌లో కేజీఎఫ్2 హంగామా.. కోర్టు ఝలక్‌తో..

    |

    సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్: చాప్టర్ 2 మూవీ షూటింగ్‌కు చుక్కెదురైంది. కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రాంత ప్రజలు కొందరు ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. పర్యావరణానికి హానీ కలిగిస్తున్న ఈ షూటింగ్‌ను వెంటనే నిలిపి వేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేయాలని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంత జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో కేజీఎఫ్2 సినిమా షూట్‌ను వాయిదా వేశారు.

    ప్రస్తుతం కోలార్ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతులు లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరులో భారీ సెట్స్ వేసి, యూనిట్‌ను షిప్ట్ చేసినట్టు సమాచారం. కోర్టు ఆదేశాలతో ఆగిపోయిన షూటింగ్.. బుధవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైనట్టు తెలిసింది. కేజీఎఫ్‌కు సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు పక్కా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

    KGF: Chapter 2 shoot started at Hyderabad with huge sets

    ఇటీవల సంజయ్ దత్ తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. అధీరా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్. అవెంజర్స్‌లో థానోస్ మాదిరిగా ఉంటుంది. చాలా భయంకరమైన మేకప్‌తో రూపొందిన డేంజర్ క్యారెక్టర్ అది. సినిమా రిలీజ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఎదురు చూస్తున్నాను అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, ఆనంత్ నాగ్, శరన్ శక్తి, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు.

    సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్: చాప్టర్ 2 మూవీ షూటింగ్‌కు చుక్కెదురైంది. కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రాంత ప్రజలు కొందరు ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. పర్యావరణానికి హానీ కలిగిస్తున్న ఈ షూటింగ్‌ను వెంటనే నిలిపి వేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేయాలని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంత జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో కేజీఎఫ్2 సినిమా షూట్‌ను వాయిదా వేశారు. ప్రస్తుతం కోలార్ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతులు లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరులో భారీ సెట్స్ వేసి, యూనిట్‌ను షిప్ట్ చేసినట్టు సమాచారం. కోర్టు ఆదేశాలతో ఆగిపోయిన షూటింగ్.. బుధవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైనట్టు తెలిసింది. కేజీఎఫ్‌కు సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు పక్కా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఇటీవల సంజయ్ దత్ తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. అధీరా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్. అవెంజర్స్‌లో థానోస్ మాదిరిగా ఉంటుంది. చాలా భయంకరమైన మేకప్‌తో రూపొందిన డేంజర్ క్యారెక్టర్ అది. సినిమా రిలీజ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఎదురు చూస్తున్నాను అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, ఆనంత్ నాగ్, శరన్ శక్తి, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సీనియర్ నటుడు ఆనంత్ నాగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. తొలిసారి ఓ నిజమైన లెజెండ్ సెట్‌లోకి అడుగుపెట్టగానే పులకరించిపోయింది. సెట్లో ఆయన టీచర్‌గా మారిపోగా, మేమంతా ఆయన శిష్యులం అయ్యాం. గొప్ప లెజెండ్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సీనియర్ నటుడు ఆనంత్ నాగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. తొలిసారి ఓ నిజమైన లెజెండ్ సెట్‌లోకి అడుగుపెట్టగానే పులకరించిపోయింది. సెట్లో ఆయన టీచర్‌గా మారిపోగా, మేమంతా ఆయన శిష్యులం అయ్యాం. గొప్ప లెజెండ్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    The shooting for KGF: Chapter 2, the sequel to the blockbuster hit KGF: Chapter 1 began on Wednesday. Popular actor Yash, who starred in the wildly popular first chapter of the film, confirmed the development on social media. Reports suggest that, the makers have now raised huge sets in Hyderabad and Bangalore, and have shifted the shooting to these two cities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X