KGF Chapter 2 నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: ‘అధీరా’ బర్త్‌డే స్పెషల్ ట్రీట్ రెడీ
ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి.. విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1'. కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. టాక్ మాత్రమే కాదు.. కలెక్షన్ల పరంగానూ ఇది దుమ్ము దులిపేసింది. అంతేకాదు, పలు జాతీయ అవార్డులు కూడా ఈ చిత్రానికి దక్కాయి. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోన్న విషయం తెలిసిందే.
మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీనికి సీక్వెల్ తీస్తున్నారు. కేజీఎఫ్‌ను తన వశం చేసుకున్న రాఖీ భాయ్‌ను ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా నడుస్తుంది. ఇక, ఆ అధీరా పాత్రను బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 29న ఆయన పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని గురువారం 'కేజీఎఫ్ చాప్టర్ 2' నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ రాబోతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆ మధ్య విడుదలైన టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఇక, ఈ సినిమాను మొదటి భాగానికి మించేలా తెరకెక్కించారని అంటున్నారు. దీంతో ఈ మూవీ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











