KGF Chapter 2 నుంచి సాలిడ్ అప్‌డేట్: టీజర్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్

ఎన్నో అంచనాల నడుమ విడుదలై.. రూపొందిన అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - స్టార్ హీరో యశ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఇండియన్ సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. అంతేకాదు, జాతీయ అవార్డుల్లో సైతం సత్తా చాటింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.

మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో 'KGF Chapter 2' అనే టైటిల్‌తో సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 21 సోమవారం 10:08 గంటలకు అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు శనివారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఓ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. 'రాఖీ భాయ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10.18 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నాం' అని అందులో పేర్కొన్నారు.

KGF Chapter 2 Teaser Date Announced

ఇదిలా ఉండగా, చాప్టర్ 1 చివర్లో గరుడను చంపి కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకుంటాడు రాఖీ భాయ్‌. ఇలాంటి సమయంలో అతడికి అధీర రూపంలో మరో శత్రువు పుట్టుకొస్తాడు. అతడిని ఎలా అంతమొందిచాడు అన్న కథతో రెండో భాగం రూపొందుతోంది. ఇందులో అధీరగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌గా శ్రీనిథి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X