Don't Miss!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
KGF Chapter 2 టీజర్ అరుదైన రికార్డు: అందులో ఎన్టీఆర్ తర్వాతనే యశ్
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి.. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. శాండిల్‌వుడ్ స్టార్ హీరో యశ్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. అదే సమయంలో కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. అందుకే దీనికి సీక్వెల్‌గా 'KGF Chapter 2'ను రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని మించేలా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ రికార్డు ఈ మూవీ సొంతం అయింది.
కొద్ది రోజుల క్రితం యశ్ పుట్టినరోజు సందర్భంగా 'KGF Chapter 2' టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని భాషలకూ కలిపి ఒకే వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ టీజర్‌కు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వీడియో ఒక మిలియన్ కామెంట్లను అందుకుంది. తద్వారా ఈ మైలురాయిని చేరుకున్న నాలుగో టీజర్‌గా ఇది రికార్డు సాధించింది. ఇప్పటికే ఇది 189 మిలియన్ వ్యూస్.. 8 మిలియన్ లైకులు అందుకుంది.
'KGF Chapter 2' టీజర్‌కు ఒక మిలియన్ కామెంట్లు ఇప్పుడు వస్తే.. RRR మూవీలోని జూనియర్ ఎన్టీఆర్ పరిచయ వీడియో రామరాజు ఫర్ భీంకు ఎప్పుడో ఈ ఘనత సొంతం అయింది. ఇండియాలోనే ఈ మైలురాయిని చేరుకున్న మొదటి టీజర్‌గా ఇది రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత పలు టీజర్లు ఈ ఫీట్‌ను అందుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.