twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF Chapter 2 టీజర్ అరుదైన రికార్డు: అందులో ఎన్టీఆర్ తర్వాతనే యశ్

    |

    కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి.. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. శాండిల్‌వుడ్ స్టార్ హీరో యశ్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. అదే సమయంలో కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. అందుకే దీనికి సీక్వెల్‌గా 'KGF Chapter 2'ను రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని మించేలా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ రికార్డు ఈ మూవీ సొంతం అయింది.

    కొద్ది రోజుల క్రితం యశ్ పుట్టినరోజు సందర్భంగా 'KGF Chapter 2' టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని భాషలకూ కలిపి ఒకే వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ టీజర్‌కు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వీడియో ఒక మిలియన్ కామెంట్లను అందుకుంది. తద్వారా ఈ మైలురాయిని చేరుకున్న నాలుగో టీజర్‌గా ఇది రికార్డు సాధించింది. ఇప్పటికే ఇది 189 మిలియన్ వ్యూస్.. 8 మిలియన్ లైకులు అందుకుంది.

    KGF Chapter 2 Teaser Gets 1 Million Comments

    'KGF Chapter 2' టీజర్‌కు ఒక మిలియన్ కామెంట్లు ఇప్పుడు వస్తే.. RRR మూవీలోని జూనియర్ ఎన్టీఆర్ పరిచయ వీడియో రామరాజు ఫర్ భీంకు ఎప్పుడో ఈ ఘనత సొంతం అయింది. ఇండియాలోనే ఈ మైలురాయిని చేరుకున్న మొదటి టీజర్‌గా ఇది రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత పలు టీజర్లు ఈ ఫీట్‌ను అందుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    K.G.F: Chapter 2 is Kannada High Budget Film. This Movie Teaser Creats So Many Record. Now This Video Gets 1 Million Comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X