KGF Chapter 2 టీజర్ నేషనల్ రికార్డు: అరుదైన మైలురాయిని చేరుకున్న రాఖీ భాయ్

పేరుకు కన్నడ సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది 'KGF Chapter 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలైంది. అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్ల సునామీని సృష్టించింది. అలాగే, జాతీయ అవార్డులను సైతం అందుకుంది. ఇంతటి ఘన విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే ఎవరూ ఊహించని రికార్డును క్రియేట్ చేసింది.

గత జనవరిలో యశ్ పుట్టినరోజు సందర్భంగా 'KGF Chapter 2' టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని భాషలకూ కలిపి ఒకే వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ టీజర్‌కు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వీడియో 200 మిలియన్ వ్యూస్‌ మార్కును చేరుకుంది. అంటే 20 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారన్న మాట. అంతేకాదు, దీనికి 8.4 మిలియన్ లైకులు.. 1.1 మిలియన్ కామెంట్లు కూడా వచ్చాయి.

 KGF Chapter 2 Teaser Gets 200 Million Views

ఇండియాలోనే ఎక్కువ మంది వీక్షించిన టీజర్ల జాబితాలో 'KGF Chapter 2' మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత హృతిక్ రోషన్ 'వార్' 129 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. తెలుగు నుంచి అల్లు అర్జున్ 'పుష్ప' 77 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'KGF Chapter 2'ను హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X