KGF Chapter 2 కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ: అదిరిపోయే ప్లాన్‌లో ఉన్న యూనిట్
ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి.. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'KGF Chapter 1'. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగ రాసింది. అంతేకాదు, కన్నడ చిత్ర పరిశ్రమ స్టామినాను భారతదేశానికి పరిచయం చేసుకుంది. అదే సమయంలో పలు విభాగాల్లో జాతీయ అవార్డులను కూడా అందుకుంది. అంతటి ప్రభావం చూపించిన ఈ సినిమాను సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది.
మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో.. దానికి సీక్వెల్‌గా 'KGF Chapter 2'ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై ఆది నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో తీస్తున్న ఈ సినిమాను జూలై 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు కరోనా వల్ల థియేటర్లు ఎక్కడికక్కడ మూత పడుతున్నాయి. దీంతో ఇదే కాదు.. ఏ సినిమానూ విడుదల చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరో తేదీని చూసుకోవాలని ఫిక్స్ అయిపోయారు.

తాజా సమాచారం ప్రకారం.. 'KGF Chapter 2' మూవీని దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటనను కూడా చేయనున్నారట. ముందుగానే ఈ తేదీని ప్రకటిస్తే.. మిగిలిన వాళ్లు దూరం జరిగే అవకాశం ఉందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. శ్రీనిథి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











