twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో... సత్తా చాటిన ‘కేజీఎఫ్’

    |

    కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటిచిన 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పలు దక్షిణాది చిత్రాల హవా కొనసాగింది. సౌత్ నుంచి తెలుగు, కన్నడ చిత్రసీమలకు చెందిన సినిమాలు సత్తా చాటాయి. తెలుగులో మహానటి, రంగస్థలం, చిలసౌ, అ! చిత్రాలతో పాటు కన్నడలో కేజీఎఫ్, నాతిచరామి చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి.

    కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమా 'కేజీఎఫ్' రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ కేటగిరిల్లో 'కేజీఎఫ్'ను అవార్డులు వరించాయి.

    KGF film team thanked the National Award Jury Committee

    ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు చిత్ర కథానాయకుడు యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. యూనిట్ సభ్యులందరి సమిష్టి కృషితోనే ఈ అవార్డులు సొంతమయ్యాయన్నారు. త్వరలో 'కేజిఎఫ్-చాప్టర్ 2' మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

    'కేజీఎఫ్ -చాప్టర్ 2' చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు. ఆయన అధీరా అనే అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. చాప్టర్ 2లో హీరో యష్, సంజయ్ దత్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి.

    'కెజిఎఫ్ 2' ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. 'అధీరా' పాత్ర సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంటుందట. సంజయ్‌తో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    KGF film team thanked the National Award Jury Committee. The KGF won two awards at the 66th National Film Awards. The film won awards in the special effects and best fights category.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X