For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యశ్.. తన భార్యను ఎలా ఆడిస్తున్నాడో చూడండి.. స్పెషల్ వీడియో షేర్ చేసిన రాధిక

|

కన్నడ సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు స్టైలిష్ హీరో యశ్. అక్కడ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'కేజీఎఫ్ చాప్టర్ 1'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో అతడి ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగులో యశ్ క్రేజ్ అమాతం పెరిగిపోయింది. దీంతో అతడి తర్వాతి సినిమాలు కూడా ఇక్కడ విడుదల చేయాలని భావిస్తున్నాడు.

ఇదిలాఉండగా, యశ్.. తన కో స్టార్ రాధిక పండిట్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో 'కేజీఎఫ్'లోని పాటకు యశ్.. రాధికకు డ్యాన్స్ నేర్పుతున్నాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన రాధిక.. 'నీ రిథమ్‌కు నేనింకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను' అని క్యాప్షన్ పెట్టింది. అంతేకాదు, ఈ వీడియో ఎంతో ప్రత్యేకమైనదని, ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తున్నానని చెప్పింది.

దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2016లో బ్ర‌హ్మీస్‌-గౌడ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకుంది. వీరికి డిసెంబ‌ర్ 2,2018న వారికి పండంటి బిడ్డ జ‌న్మించింది. రాధిక‌, య‌శ్‌లు టీవీ సీరియ‌ల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌గా, 2008లో 'మొగ్గిన మ‌సు' అనే చిత్రంతో తొలిసారి వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. 'డ్రామా', 'మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి' 'సంతు స్ట్రైట్ ఫార్వార్డ్' అనే చిత్రాల‌లో వారిరివురు క‌లిసి న‌టించారు.

KGF Hero Yash dancing With His Wife

య‌శ్ ప్ర‌స్తుతం 'కేజీఎఫ్‌ చాప్టర్ 2' చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పార్టును తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో 'కేజీఎఫ్'కు బెస్ట్ యాక్షన్ విభాగంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

English summary
Kannada film industry's popular couple, Yash and Radhika Pandit are winning our hearts with their latest adorable video. The couple has always set major relationship goals and their new dancing video is winning our hearts.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more