Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
యశ్.. తన భార్యను ఎలా ఆడిస్తున్నాడో చూడండి.. స్పెషల్ వీడియో షేర్ చేసిన రాధిక
కన్నడ సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు స్టైలిష్ హీరో యశ్. అక్కడ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'కేజీఎఫ్ చాప్టర్ 1'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో అతడి ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగులో యశ్ క్రేజ్ అమాతం పెరిగిపోయింది. దీంతో అతడి తర్వాతి సినిమాలు కూడా ఇక్కడ విడుదల చేయాలని భావిస్తున్నాడు.
ఇదిలాఉండగా, యశ్.. తన కో స్టార్ రాధిక పండిట్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో 'కేజీఎఫ్'లోని పాటకు యశ్.. రాధికకు డ్యాన్స్ నేర్పుతున్నాడు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన రాధిక.. 'నీ రిథమ్‌కు నేనింకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను' అని క్యాప్షన్ పెట్టింది. అంతేకాదు, ఈ వీడియో ఎంతో ప్రత్యేకమైనదని, ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తున్నానని చెప్పింది.
దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2016లో బ్రహ్మీస్-గౌడ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. వీరికి డిసెంబర్ 2,2018న వారికి పండంటి బిడ్డ జన్మించింది. రాధిక, యశ్‌లు టీవీ సీరియల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయగా, 2008లో 'మొగ్గిన మసు' అనే చిత్రంతో తొలిసారి వెండితెరకి పరిచయం అయ్యారు. 'డ్రామా', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' 'సంతు స్ట్రైట్ ఫార్వార్డ్' అనే చిత్రాలలో వారిరివురు కలిసి నటించారు.
యశ్ ప్రస్తుతం 'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పార్టును తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో 'కేజీఎఫ్'కు బెస్ట్ యాక్షన్ విభాగంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.