సిగ్గుపడేలా చేయకూడదు.. నా ఫ్యాన్స్ అలా చేస్తే ఒప్పుకోను..మృత్యువుతో పోరాడుతూ హీరోను చూడాలని!
అభిమానుల పిచ్చి పనులు సినీ తారలకు తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. తాము అమితంగా ఇష్టపడే హీరోలను, హీరోయిన్లను కలువడానికి ఎక్కడెక్కడ నుంచో దూర తీరాల నుంచి వస్తుంటారు. వారు తమ తారలను కలుసుకోలేని సమయంలో ఏదో అఘాయిత్యానికి పాల్పడుతుంటారు. అలాంటి సంఘటన ఇటీవల కన్నడ సినిమా పరిశ్రమలో చోటుచేసుకొన్నది. యష్‌ను కలుసుకోవడంలో విఫలమైన అభిమాని ఒంటికి నిప్పంటించుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై హీరో యష్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

యష్‌ను కలువలేదనే బాధతో
యష్‌ను కలువలేదనే బాధతో రవి రఘురాం నిప్పంటించుకొని హాస్పిటల్‌లో చేరాడు. 70 శాతం గాయాలతో, హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతూ ఉన్న సమయంలో కూడా ఒక్కసారి చూడాలని ఉందని రవి కోరడంతో యష్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. చివరకు చికిత్స పొందుతూ రవి మృతి చెందడం అందర్ని కలిచివేసింది.

అభిమానమంటే నమ్మలేకపోతున్నాను
రవి మరణంపై కలత చెందిన యష్ మాట్లాడుతూ.. నా అభిమాని రవి రఘురాం గతేడాది నా పుట్టిన రోజున నాతో సెల్ఫీ దిగాడు. అలాంటి వ్యక్తి ఇలా దారుణంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అతను నా ఫ్యాన్ చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. ఇదే అభిమానమంటే నమ్మలేకపోతున్నాను. నా ఫ్యాన్స్ ఎవరూ అలాంటి దారుణమైన సంఘటనలకు పాల్పడవద్దు అని హెచ్చరించారు.

పిచ్చి పనులకు పాల్పడుతారని
నా బర్త్ డేకి కొన్ని రోజుల ముందు అభిమానులకు నా బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. నేను నా పుట్టినరోజును జరుపుకోవడం లేదని ముందే స్పష్టం చేశాను. కానీ అభిమానులు ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడుతారని నేను అనుకోలేదు అని యష్ మీడియాలో స్పందించారు.

బాధ్యతగా మసులుకోవాలి
సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉండాలని నా ఫ్యాన్స్‌కు ఎపుడూ చెప్తుంటాను. అదే విషయాన్ని ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటాను. వారి ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలని, మంచి మనుషులుగా ఉండాలని కోరుతుంటాను. నా ఫ్యాన్స్ అలా ఉండే నాకు గర్వంగా ఉంటుంది అని యష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











