'సెకండ్ ప్రభాస్' అంటూ కామెంట్.. అదిరేలా సమాధానం ఇచ్చాడు!

కన్నడ నటుడు యష్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. యష్ నటిస్తున్న కెజిఎఫ్ చిత్రం బహుభాషా చిత్రంగా డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం కోసం యష్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల విడుదలైన కెజిఎఫ్ ట్రైలర్ అందరిని విపరీతంగా ఆకర్షించింది. కెజిఎఫ్‌లో యష్ రఫ్ లుక్ లో అదరగొడుతున్నాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెజిఎఫ్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వివరించాడు. ఈ కన్నడ హీరో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించబోతున్నట్లు కూడా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తల్లో వాస్తవం లేదు

ఆ వార్తల్లో వాస్తవం లేదు

కెజిఎఫ్ చిత్రాన్ని నాలుగేళ్ళ పాటు చిత్రీకరించారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యష్ తెలిపాడు. మా జర్నీ అన్ని రోజులు జరిగిందని మాత్రమే చెప్పాం. వాస్తవానికి సినిమాని కేవలం 150 రోజుల్లో పూర్తి చేశాం అని యష్ తెలిపాడు. సినిమా భారీ ఎత్తున తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తుండడంతో అందుకు తగ్గట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాం అని యష్ తెలిపాడు.

ఆడియన్స్ విజిల్ కొడితే చాలు

ఆడియన్స్ విజిల్ కొడితే చాలు

ఇప్పటివరకు యష్ నాలుగు ఫిలిం ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. కెజిఎఫ్ చిత్రం మరో అవార్డుపై కన్నేశారా అనే ప్రశ్నకు యాష్ అద్భుతమైన సమాధానం ఇచ్చారు. నాకు అవార్డ్స్‌పై ఆసక్తి లేదు. ఆడియన్స్ నా చిత్రాన్ని చూసి విజిల్ కొడితే చాలు అని యష్ తెలిపాడు. ప్రాంతీయ భాషా చిత్రం ఏదైనా అని భాషల్లో రాణించాలని తెలిపాడు. రాజమౌళి బాహుబలి ఆ విషయంలో విజయం సాధించింది. ప్రాంతీయ భాషా చిత్రానికి భాష అనేది అడ్డు కాకూడదని యష్ తెలిపాడు.

అలాంటి ఆలోచన లేదు

అలాంటి ఆలోచన లేదు

నేను ఒక స్టార్ డైరెక్టర్‌తో చేయాలనే ఆలోచన పెట్టుకొను. నా కెరీర్‌లో ఎక్కువ చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశానని యష్ తెలిపాడు. కాన్సెప్ట్ బావుంటేనే విజయం వస్తుంది.. కాంబినేషన్ బావుంటే కాదు అని యష్ తెలిపాడు. కథ బావుంటే ఎలాంటి దర్శకుడితో అయినా సినిమా చేస్తానని యష్ తెలిపాడు. కెజిఎఫ్ చిత్రాన్ని కూడా మంచి కథతో రూపొందించాం అని అన్నాడు.

సెకండ్ ప్రభాస్

సెకండ్ ప్రభాస్

మిమ్మలి సౌత్ ఇండియా సెకండ్ ప్రభాస్ అని చాలా మంది అంటున్నారు. కెజిఎఫ్ చిత్రం కూడా ఛత్రపతి చిత్రాన్ని పోలి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అనే ప్రశ్నకు యష్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. నాకు సెకండ్ అనే కామెంట్స్ నచ్చవు. నేను మొదటి యష్ లాగే ఉండాలని అనుకుంటున్నా. ఇక ప్రభాస్ ఛత్రపతి చాలా మంచి చిత్రం. కానీ ఛత్రపతికి, కెజిఎఫ్‌కు ఎలాంటి పోలిక లేదని యష్ క్లారిటీ ఇచ్చాడు.

ఆర్ఆర్ఆర్‌పై క్లారిటీ

ఆర్ఆర్ఆర్‌పై క్లారిటీ

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో యష్ విలన్ పాత్రలో నటించబోతున్నాడంటూ అటు కన్నడ మీడియాలో, తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై యష్ క్లారిటీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం నన్నెవరూ సంప్రదించలేదని, రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తానని యష్ రూమర్స్‌కు చెక్ పెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X