Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
రష్మిక మందన్నపై కేజీఎఫ్ హీరో యష్ ఫైర్.. ఏం జరిగిందంటే!
టాలీవుడ్లో వరుస విజయాలు దక్కించుకొంటున్న కన్నడ భామ రష్మిక మందన్నపై కేజీఎఫ్ హీరో యష్ తీవ్రంగా మండిపడ్డారు. కన్నడ భాష రాదంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మీడియాలో సంచలనంగా మారింది. కన్నడ చిత్రం కిస్ వేడుకకు హాజరైన యష్ చేసిన వ్యాఖ్యలు మీడియా పతాక శీర్షికలను ఆకర్షించాయి. ఇంతకు యష్ ఏమన్నారంటే..
కొత్త హీరోయిన్‌పై యష్ ప్రశంసలు
కిస్ ఫంక్షన్లో యష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించిన నూతన హీరోయిన్ శ్రీ లీలాపై ప్రశంసల వర్షం కురిపించారు. కన్నడ చిత్రసీమకు సంబంధించిన హీరోయిన్లు వేరే భాషలో కూడా రాణించాలి. ఇతర భాషల్లో కూడా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకొనేలా టాలెంట్‌ను చాటుకోవాలి అని అన్నారు.
లోకల్ టాలెంట్‌కు సపోర్ట్ చేయాలి
నా కొత్త సినిమా ప్రారంభమైన ప్రతీసారి ఇతర భాషల నుంచి హీరోయిన్ను దిగుమతి చేసుకొంటాననే వార్తను న్యూస్ పేపర్లలో చూస్తాను. లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించరనే వార్త వారాలు తరబడి చూస్తుంటాను. అలాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెడుతాయి. కానీ లీలా లాంటి లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు అభినందనలు అని యష్ పేర్కొన్నారు.
మూలాలు మరువొద్దు అని
కన్నడ భాష నుంచి ఇతర భాషల్లోకి వెళ్లి తమ టాలెంట్‌తో గొప్ప పేరు సంపాదించుకోవాలి. కన్నడ చిత్ర సీమకు మంచి గౌరవాన్ని తీసుకురావాలి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. కన్నడ నుంచి ఇతర భాషలకు వెళ్లి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న తర్వాత మూలాలను మరిచిపోవద్దు అని అన్నారు. ఎప్పటికీ తమకు జన్మనిచ్చిన కన్నడ సినీ పరిశ్రమను అగౌరవ పరుచవద్దు అని రష్మికపై పరోక్ష వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
డియర్ కామ్రేడ్ సినిమా సందర్భంగా
కొద్ది రోజుల క్రితం డియర్ కామ్రేడ్ సినిమా ప్రచారం సందర్భంగా నాకు కన్నడ భాష ధారళంగా మాట్లాడటం రాదు అని రష్మిక కామెంట్ చేయడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు కన్నడ వాసులను మనస్తాపానికి గురిచేశాయి. జగ్గేష్ లాంటి పలువురు కన్నడ సీనియర్ నటులు రష్మికపై భగ్గుమన్న సంగతి తెలిసిందే.