మరో బిడ్డకు జన్మనిచ్చిన యష్ దంపతులు.. వారసుడొచ్చాడు అంటూ సంబరాలు
Recommended Video
సంచలన కన్నడ నటుడు యష్ ఫ్యాన్స్‌కు శుభవార్త. కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సంపాదించుకొన్న హీరో తాజాగా మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి రాధిక పండిట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో యష్ కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రాధిక పండిట్ బిడ్డకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

రెండో బిడ్డకు స్వాగతం
యష్ దంపతులు తమ రెండో బిడ్డను స్వాగతించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మగబిడ్డ, తల్లి క్షేమంగా ఉన్నారు. ఇద్దరి ఆరోగ్యం బాగుంది. తదుపరి వివరాలు అధికారికంగా యష్ వెల్లడిస్తారని మీడియాకు సన్నిహితులు పేర్కొన్నారు. తమ ఇంట్లోకి వారసుడు రావడంపై కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త తెలియగానే అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

చిన్నారి ఫొటో వైరల్
యష్ రెండో బిడ్డకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. తండ్రి చేయిని పట్టుకొన్న పసిపాప చేతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులు కంగ్రాట్స్ మెసేజ్‌లతో యష్ దంపతులు తడిసి ముద్దవుతున్నారు. త్వరలోనే యష్ తన మాధ్యమాల ద్వారా అధికారికంగా శుభవార్తను వినిపించే అవకాశం ఉంది.
తొలి బిడ్డ ఆర్యతో
గతేడాది యష్, రాధిక పండిట్ దంపతులు కూతురుకు జన్మను ప్రసాదించారు. ఆ చిన్నారి పేరు ఆర్య అనే విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే దంపతులు తమ కూతురితో జరుపుకొన్న దీపావళీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పదినెలల చిన్నారి బుజ్జి బుజ్జిగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నదని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మా బిడ్డకు మీ దీవెనలు కావాలి
మా చిన్నారికి ఇది తొలి దీపావళీ. అంతకంటే మా జీవితంలో గొప్ప అనుభూతి ఏముంటుంది. అభిమానులు, ప్రజలందరికీ దీపావళీ శుభాకాంక్షలు. మీ అందరి కోసం ఆర్య ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నది. దయచేసి మీ దీవెనలు మాకు అందించండి అంటూ యష్ దంపతులు తమ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోతోపాటు సందేశాన్ని పోస్టు చేశారు.


Click it and Unblock the Notifications











