twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేజీఎఫ్ ఖాతాలో మరో రికార్డు.. ఏ హీరోకు దక్కన్నట్లుగా.. సోషల్ మీడియాలో వైరల్

    |

    ఒకే ఒక్క చిత్రం మొత్తం ఇండస్ట్రీకే గర్వ కారణంగా మారింది. ఇన్ని దశాబ్దాలైన వంద కోట్టు కొల్లగొట్టడం గగనమైన తరుణంలో ఒకడొచ్చాడు. కేవలం తను ఉన్న ఇండస్ట్రీనే కాదు.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా తేడా లేకుండా అందరి లెక్కలు సరిచేశాడు. వాడే రాకీ భాయ్.. కన్నడ సంచలనం యశ్. కేజీఎఫ్ సినిమా మొత్తం దేశాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎక్కడ చూసినా యశ్ సృష్టించిన ప్రకంపనలే కనిపించాయి.

    కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్..

    కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్..

    అప్పటి వరకు చిన్న సినిమాలు, బడ్జెట్ రిత్యా మన హీరోల పారితోషికాలంత ఉండని చిత్రాలను తెరకెక్కించే కన్నడ పరిశ్రమ.. ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. రాజమౌళి సలహా మేరకు ప్యాన్ ఇండియా చిత్రంగా మలిచినట్టు పేర్కొన్న కేజీఎఫ్ అన్ని ఇండస్ట్రీల్లో సంచనాలు నమోదు చేసి.. శాండిల్ వుడ్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

    దాదాపు 250 కోట్లు..

    దాదాపు 250 కోట్లు..

    ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. హిందీలో కేవలం డబ్బింగ్ రూపంలోనే రిలీజై అక్కడి స్టార్ హీరోలకు ముచ్చెటమలను పట్టించింది. బాహుబలితో ప్రభాస్ ఇండియన్ హీరోగా ఎదగ్గా.. యశ్ సైతం ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు.

    అత్యంత భారీ ఎత్తున చాప్టర్ 2..

    అత్యంత భారీ ఎత్తున చాప్టర్ 2..

    కేజీఎఫ్ ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేయడంతో చాప్టర్ 2ను అత్యంత భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ రికార్డులను క్రియేట్ చేయగా.. వాటిని అధిగమించేలా ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    తాజాగా మరో రికార్డును ఖాతాలో..

    తాజాగా మరో రికార్డును ఖాతాలో..

    ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న కేజీఎఫ్.. తాజాగా మరో ఖాతాను ఎగరేసుకుపోయింది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో కేజీఎఫ్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2019 సంవత్సరానికి గాను అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా కేజిఎఫ్ నిలిచింది. కేజిఎఫ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా అత్యధికంగా వ్యూస్ సాధించి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికీ రాకీ భాయ్ సత్తా చాటుతూనే ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    KGF in all languages is the Most Viewed Indian Movie on #AmazonPrime in 2019. tHIS Movie Is Directed By Prashanth Neel. Now Sequel Of KGF Is Being Shooted. Sanjay Dutt Playing AN Important Role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X