twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెజిఎఫ్ 2కు ఊహించని సమస్య, రిలీజ్‌పై ప్రభావం పడుతుందా?

    |

    కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ షెడ్యూల్ మరొక రోజులో పూర్తి అవుతుంది అనగా... చిత్రీకరణ నిలిపి వేస్తూ కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నివాసి, యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కారణంగా ఈ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటూ కేసు వేశారు.

    అయితే కెజిఎఫ్ చాప్టర్ 1 షూటింగ్ ఆరు నెలల పాటు సైనైడ్ హిల్స్‌లో జరిపినపుడు తాము అలాంటివేమీ ఫేస్ చేయలేదని చిత్ర బృందం చెబుతోంది. ప్రొడక్షన్ హౌస్ నుండి కార్తీక్ గౌడ అనే వ్యక్తి ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కెజిఎఫ్ బృందం చట్టపరమైన విధానాన్ని అనుసరిస్తుందని చెప్పారు.

    ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు

    ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు

    స్థానిక నివాసి ఎన్ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉద్దేశించి కార్తీక్ మాట్లాడుతూ, "మేము కెజిఎఫ్ : చాప్టర్ 1 కోసం ఆరు నెలలు ఒకే ప్రదేశంలో చిత్రీకరించాము. అప్పుడు ఎటువంటి సమస్యలను ఎదుర్కోలేదు. ఇపుడు సమస్య ఎందుకు వచ్చిందో మాకు నిజంగా తెలియదు అన్నారు. మేము ఇక్కడ షూటింగ్ జరుపడం, సెట్స్ వేయడం వల్ల దుమ్ము ఏర్పడి వాయు కాలుష్యం ఏర్పడుతోందని, దాని వల్ల పర్యావరణం దెబ్బతింటోందని పిటీషనర్ కేసు వేశారు' అని చెప్పుకొచ్చారు.

    వాస్తవ పరిస్థితి అలా లేదు

    వాస్తవ పరిస్థితి అలా లేదు

    "కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. ఈ ప్రాంత నివాసితులకు మాపై ఎటువంటి ఫిర్యాదులు లేవు, ఎందుకంటే సెట్ల కోసం వస్తువుల రవాణా, సెట్ల నిర్మాణం, మేము చేస్తున్న పని వల్ల దుమ్ము ఏర్పడటం లేదు" అన్నారు.

    చట్టపరమైన విధానాన్ని అనుసరిస్తాం

    చట్టపరమైన విధానాన్ని అనుసరిస్తాం

    సినిమా షూటింగును ప్రభావితం చేసేలా స్టే ఆర్డర్ ఉంది. ఈ విషయంలో కెజిఎఫ్ బృందం చట్టపరమైన విధానాన్ని అనుసరించాలని డిసైడ్ అయింది. తాము ఇక్కడ షూటింగ్ జరుపడం వల్ల ఎంతో మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలను కల్పించామని పేర్కొన్నారు.

    సినిమా రిలీజ్ మీద ప్రభావం చూపుతుందా?

    సినిమా రిలీజ్ మీద ప్రభావం చూపుతుందా?

    కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదల అనుకున్న దానికంటే ముందస్తుగా ఉంటుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఊహించని విధంగా కోర్టు స్టే ఆర్డర్ కారణంగా సినిమా చివరి దశలో ఆగిపోయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇపుడు ఈ కేసు కారణంగా రిలీజ్ మీద ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    English summary
    KGF Chapter 2 was only a day away from wrapping its shooting schedule when the court issued a stay order. A resident of Kolar Gold Fields claimed that the filming activities of Yash's movie were having an adverse effect on the flora and fauna of the region. However, the makers have to say that they faced no such issued while shooting in Cyanide Hills for six months row during KGF Chapter 1. Karthik Gowda, from the production house told Times of India that KGF team will follow the legal suit to resolve the issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X