ప్రమాదానికి గురైన హీరో సుదీప్.. కొన్ని వారాలపాటు షూటింగ్ దూరం
సినీ పరిశ్రమలో టాప్ హీరోలు ఇటీవల కాలంలో గాయాల బారిన పడుతున్నారనే వార్త తరచుగా వినిపిస్తున్నది. RRR చిత్రంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, మరో యువ హీరో శర్వానంద్, అలాగే వరుణ్ తేజ్ గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణాదిలో టాప్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరున్న కిచ్చ సుదీప్ కూడా ప్రమాదానికి లోనవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
సుదీప్ ప్రస్తుతం కొటిగొప్ప 3, దంబంగ్ 3 చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా కొటిగొబ్బ అనే చిత్రంలో సుదీప్ గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో ఓ స్టంట్ సీక్వెన్స్ సందర్భంగా సుదీప్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో వీపు భాగంలో పెద్ద గాయమే అయినట్టు సమాచారం.

వెన్నుకు గాయం కావడంతో వైద్యులు కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకోమన్నట్టు సమాచారం. గాయం మానక ముందు ఒత్తిడి కలిగిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదనేది సమాచారం. దాంతో కొన్ని వారాల పాటు సుదీప్ విశ్రాంతి తీసుకొవాలని నిర్ణయించారట.
దంబంగ్ 3, కోటిగబ్బ చిత్రాలతోపాటు పహిల్వాన్, చిరంజీవి నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటిస్తున్నారు. సుదీప్ నటించిన సైరా పలు భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











