హోస్ట్‌గా తప్పుకొంటున్నాను... బిగ్‌బాస్‌కు షాకిచ్చిన కిచ్చ సుదీప్!

బిగ్‌బాస్ రియాలిటీ షో అంటే ముందుగా ప్రేక్షకులకు గుర్తొచ్చేది హోస్ట్‌లు. హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో కిచ్చ సుదీప్, తమిళంలో కమల్ హాసన్, తెలుగులో నాగార్జున, మలయాళంలో మోహన్‌లాల్ అక్కినేని ఠక్కున గుర్తొస్తారు. అయితే తాజాగా కన్నడ బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో హోస్ట్ కిచ్చ సుదీప్ మీడియాతో మాట్లాడుతూ..

బిగ్‌బాస్ కన్నడ రియాలిటీ షోకు హోస్ట్‌గా చేయమని నిర్వాహకులు అడిగినప్పుడు నాపై నాకే అనేక సందేహాలు కలిగాయి. పాపులారిటీ ఉన్న షోను సక్రమంగా నిర్వహించగలనా అంటూ నాకు నేను ప్రశ్నించుకొన్నాను. నా హోస్టింగ్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే భయం నాలో కలిగింది అని కిచ్చ సుదీప్ తెలిపారు.

2013లో ఈటీవీ కన్నడలో

2013లో ఈటీవీ కన్నడలో

2013లో ఈటీవీ కన్నడ బిగ్‌బాస్ కన్నడ రియాలిటీ షోను నిర్వహించింది. ఆ తర్వాత 2014 నుంచి ఏషియానెట్ సువర్ణ ప్రసారం చేసింది. అనంతరం మళ్లీ ఈటీవికి వెళ్లడం ఆ తర్వాత ఆ ఛానెల్‌ కలర్స్ కన్నడగా మారింది అని సుదీప్ గుర్తు చేశారు. ఆ సమయంలో కన్నడ కలర్స్ అదినేత పరమేశ్వరన్ గుడ్కల్‌తో సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత వరుసగా ఐదేళ్లపాటు హోస్ట్‌గా చేయడానికి ఒప్పందం కుదిరింది.

హోస్ట్‌గా ఇబ్బంది పడిన సందర్బాలు

హోస్ట్‌గా ఇబ్బంది పడిన సందర్బాలు

వారానికి రెండు రోజులుగా వ్యవహరించడంలో హోస్ట్‌గా కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా మారింది. కంటెస్టెంట్ల మధ్య గొడవల వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. గొడవలు బాగా జరిగినప్పుడు బ్రేక్ ఇచ్చి వెళ్లిపోయే ప్లాన్‌ను సిద్దం చేసుకొనే వాడిని. ఆ తర్వాత కంటెస్టెంట్లు తమ కోపాన్ని తగ్గించుకోనే వారు అంటూ కిచ్చ సుదీప్ తన అనుభవాలను చెప్పారు.

6వ సీజన్ నుంచి తప్పుకొంటానంటూ

6వ సీజన్ నుంచి తప్పుకొంటానంటూ

బిగ్‌బాస్ కన్నడను ఐదు సీజన్లు పూర్తయిన తర్వాత 6వ సీజన్‌కు నేను హోస్ట్‌గా వ్యవహరించను అని నిర్వాహకులకు స్పష్టం చేశాను. కానీ కలర్స్ హెడ్ పరమేశ్వరన్‌తో మాట్లాడి నా తర్వాత హోస్ట్‌ను వెతకండి అంటూ సలహా ఇచ్చాను. అయితే ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఎలాగోలా నన్ను హోస్ట్ ఉండేలా ఒప్పించారు అని కిచ్చ సుదీప్ పేర్కొన్నారు.

బిగ్‌బాస్ కన్నడ 8వ సీజన్ ఫిబ్రవరి 28న

బిగ్‌బాస్ కన్నడ 8వ సీజన్ ఫిబ్రవరి 28న

ఇక కన్నడ బిగ్‌బాస్ సీజన్ 8 ఆదివారం (ఫిబ్రవరి 28) తేదీన ప్రారంభం కానున్నది. ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీతా భారతీ భట్, రఘు గౌడ, రాగిణి ద్వేవేది, కిరణ్ శ్రీనివాస్, ఆర్జే రాజేష్, సమీక్ష, సునీల్ రావు, అనుష రంగనాథ్, సుక్రుత నాగ్, తబ్లా నాని, రజనీ, తరంగ విశ్వ, హనుమంత, నయన శరత్ పేర్లు బయటకు వచ్చాయి. అయితే అధికారికంగా ఆదివారం రాత్రి కంటెస్టెంట్లు ఎవరనేది తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X