3 రోజులపాటు సల్మాన్‌తో ఫాంహౌజ్‌లో.. కిచ్చ సుదీప్ కూతురు అనుభవాలు.. నిజమేమిటంటే?
సౌత్, నార్త్ అని భేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీ లకి చెందిన నటీనటులు ఈ మధ్య కాలంలో ఆయా స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇలా బాలీవుడ్ సహా తెలుగు హీరోలు కొందరి విలన్ గా అయితే కొందరు హీరోలుగా ఒకరి సినిమాల్లో ఒకరు నటిస్తున్నారు. అలా బాలీవుడ్ హీరోస్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే అలాంటి హీరోతో ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ కూతురు సాన్వీ చెప్పిన విషయాలు కొంత వివాదాస్పదంగాను, అలాగే కొంత సల్మాన్ ఖాన్ ప్రతిష్టను పెంచేలా ఉన్నాయి. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
సల్మాన్ ఖాన్ హీరోగా ఇపుడు చేస్తున్న సినిమాలు అంతంత మాత్రం రేంజ్ లోనే ఆడుతున్నాయి. కాగా తాను చేసిన గత కొన్నేళ్ల చిత్రాల్లో దబాంగ్ 3 కూడా ఒకటి. మరి ఈ సినిమాలో తనకి విలన్ గా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి సుదీప్ కుటుంబానికి సల్మాన్ కి సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఇదిలా ఉండగా ఇపుడు సుదీప్ కూతురు సల్మాన్ ఖాన్ పై చేసిన స్టేట్మెంట్ ఒకటి ఊహించని విధంగా మారింది.

కాగా నార్త్ లోనే పలు సోషల్ మీడియా వర్గాలు కిచ్చా సుదీప్ కూతురు సాన్వి సుదీప్ చేసిన కామెంట్స్ అంటూ కొన్ని వైరల్ గా మారాయి. కాగా ఈమె ఏమని చెప్పిందని ప్రచారం జరుగుతుంది అంటే సల్మాన్ ఖాన్ తో వర్క్ చేయడం అనేది ఒక మర్చిపోలేని ఎక్స్ పీరియన్స్ అని అలాగే సల్మాన్ నన్ను తన ఫార్మ్ హౌస్ లో మూడు రోజులు పాటు పాడు చేసేసారు అని సాన్వీ చెప్పినట్టుగా ఆ వీడియోను పోస్ట్ చేశారు.
ఆ మూడు రోజులూ నాకు జీవితంలో మర్చిపోలేని రోజులు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇపుడు ఆమెపై వైరల్ గా మారింది. దీనితో ఇవి వినేందుకే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ అసలు ఈ కామెంట్స్ లో నిజం ఎంత అనేది తెలీకుండా సోషల్ మీడియాలో ఊహించని విధంగా ఇవి సర్క్యులేట్ అయిపోతున్నాయి. కాగా వీటి వెనుక అసలు నిజం మరొకటి ఉన్నట్టుగా తెలుస్తుంది.
శాన్వి వయసు 14 ఉన్నపుడు తన నాన్న సుదీప్ ముంబై సల్మాన్ ఇంటికి తీసుకెళ్లారని, దబాంగ్ 3 షూటింగ్ టైం లో తాను సల్మాన్ తో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అలా తన ఫార్మ్ హౌస్ లో సల్మాన్ తనని ఎంతో స్వీట్ గా చూసుకున్నారు ఆయనొక స్వీట్ పర్శన్ బయటకి ఎక్కడా పంపకుండా అక్కడ తనపై కేర్ తీసుకున్నారని ఒక వీడియో తనపై ప్రచారం జరుగుతున్న వక్ర స్టేట్మెంట్ పై బయటకి వచ్చింది.
సో దీనితో సుదీప్ కూతురు విషయంలో సల్మాన్ తప్పుగా ప్రవర్తించడం కానీ లేదా వేరేగా ఏమన్నా జరగడం వంటివి లేదని చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాలో పలు ఫేమస్ హ్యాండిల్స్ కూడా ఈ రకంగా వార్తలు స్ప్రెడ్ చేయడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సదరు ప్రాడ్ కాస్ట్‌ను తప్పుడు రీతిలో ఎడిటింగ్ చేసి వదలిన యూట్యూబ్ ఛానెల్‌పై పరువు నష్టం దావా వేసేందుకు సిద్దమవుతున్నారు. సెన్సేషనలిజం కోసం ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం సాన్వీ సుదీప్ వీడియో వైరల్ అవుతుండటంతో సదురు సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కేసు నమోదు చేయాలని నిర్ణయించుకొన్నారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నుంచి దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రం సికందర్ తో రిలీజ్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ లు హీరోయిన్స్ గా నటించారు.


Click it and Unblock the Notifications











