Kiccha Sudeep: ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టారు? కిచ్చా సందీప్ దిమ్మతిరిగే రిప్లే..
Kiccha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ'సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఇలా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీప్ .. తాజాగా 'మాక్స్' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాకు మ్యాక్స్ అని ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం ఒక హార్ట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మ్యాక్స్ సినిమా టైటిల్ పెట్టడం ఎందుకు చర్చనీయంగా మారిందనే విషయాల్లోకి వెళ్లే..
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కు తెలుగులోనూ అభిమానులున్నారు. ఈగ సినిమాలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీప్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాహుబలి సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ లో కనిపించిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే హిందీలోనూ కొన్ని సినిమాలలో నటించి మెప్పించారు ప్రస్తుతం కన్నడలో హీరోగా బిజీగా ఉన్న సుదీప్ అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు.

అంతే కాకుండా.. కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాదు సుదీప్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతున్నాయి వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది అలా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'మ్యాక్స్' విడుదలకు సిద్ధంగా ఉన్నాడు, ఇది డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మ్యాక్స్ మూవీ యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో సినిమాకు మ్యాక్స్ అని ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టారు.అంత అవసరం ఉందా?'' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు హీరో సందీప్ సమాధానమిస్తూ.. ''మీడియాలో కూడా చాలా వరకూ పేర్లు ఇంగ్లీష్‌లోనే ఎందుకు ఉన్నాయి. నేను కన్నడలో మాట్లాడుతున్నా కాబట్టి కన్నడ నటుడినని తెలుసు.. మిగితా వారికి తెలియదు కాదా? ప్రశ్నించారు. అయితే కర్ణాటక లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఉన్నాయి. అందులో చాలా మంది కన్నడ పిల్లలు చదువుకుంటున్నారు. అసలు మీ సమస్య ఏంటి? ఇంగ్లీష్‌లో ఏ ఫర్ యాపిల్ అని చెబుతారు. మరి కన్నడలో ఏమంటారో చెప్పండి' అని అన్నారు.

హీరో సమాధానంతో అక్కడి వారు షాకయ్యారు. ప్రస్తుతం సుదీప్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీడియాకు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. సూపర్ అంటూ కామెంట్స్ చేశారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన 'మ్యాక్స్' చిత్రంలో సుదీప్‌తో పాటు సునీల్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం , హిందీలో విడుదలకు సిద్దంగా ఉంది. సందీప్ కిచ్చా.. 'మ్యాక్స్'తో పాటు,'బిల్లా రంగ బాషా', 'కబ్జా 2'తో సహా పలు ప్రాజెక్ట్‌లను లైన్‌లో ఉంచారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించబోతున్నారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











