రాజకీయాల్లోకి కిచ్చ సుదీప్? కర్ణాటకలో రచ్చగా ఆ టాప్ లీడర్‌తో భేటీ
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ జోరందుకొంటుండగా, కర్ణాటకలో కాస్త ముందే ఎలక్షన్ జోష్ కనిపిస్తున్నది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సంసిద్దమవుతున్నాయి. ఇటీవల కర్ణాటకలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన తర్వాత ఎన్నికల వేడి ఊపందుకొన్నది. కంతార, కేజీఎఫ్ చిత్రాల నటులు యష్, రిషబ్ శెట్టిలను ప్రధాని మోదీ కలవడం చర్చనీయాంశమైంది. ఇలాంటి సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ దిగ్గజ నేత డీకే శివకుమార్‌ను కిచ్చ సుదీప్ కలవడం దక్షిణాదిలో చర్చకు దారి తీసింది.
డీకే శివకుమార్, కిచ్చ సుదీప్ కలయికతో రకరకాల ఊహగానాలు మీడియాలో షికారు చేస్తున్నాయి. కిచ్చ సుదీప్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి వార్తలను కిచ్చ సుదీప్ ఖండించకపోవడంతో రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే వార్తకు బలం చేకూరింది.

అయితే డీకే శివకుమార్‌తో కలవడం వెనుక ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఆయనకు ఇతర రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైని సుదీప్ కూడా కలిశారు. అయితే అన్నీ పార్టీల నేతలతో సుదీప్ రిలేషన్స్ ఉన్నాయని సన్నిహితులు తెలిపారు.
ఇక కిచ్చ సుదీప్ విషయానికి వస్తే.. ఇటీవల విక్రాంత్ రోనా సినిమాతో భారీ విజయం అందుకొన్నారు. బిగ్‌బాస్ కన్నడ షోకు హోస్ట్‌గా దిగ్విజయంగా కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











