డ్రగ్స్ కేసు: హీరోయిన్లకి బెయిల్ దొరకనట్లే.. స్టార్ హీరోలపై పోలీసుల స్పెషల్ ఫోకస్?

కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా డ్రగ్స్ వివాదం ఊహించని అలజడిని రేపింది. గతంలో ఎప్పుడు లేని విధంగా హీరోయిన్స్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. బలమైన సాక్ష్యాలు ఉండడం వల్లనే సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారు డ్రగ్స్ వాడినట్లు గాని, సరఫరా చేసినట్లు గాని ఇంతవరకు నేరం ఋజువు కాలేదు. దీంతో పోలీసు అధికారులపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు

ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు

నేరం రుజువుకాక ముందే ఎలా అరెస్ట్ చేస్తారని వారి కుటుంబ సభ్యులు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. మరోవైపు మహిళా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఇక కేసు నమోదైన రోజు నుంచే హీరోయిన్స్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ కోర్టు వారికి ఊహించని ఝలక్ ఇస్తోంది. వాయిదాల మీద వాయిదాలు వేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హీరోయిన్స్ బయటకు వెళితే..

హీరోయిన్స్ బయటకు వెళితే..

ప్రతి రోజు ఫ్యాషన్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఏసీ గదుల్లో సేద తీరే సంజనా, రాగిణి ఇద్దరు కూడా ఒక సాధారణ ఖైదీల మాదిరిగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇక మరోవైపు పోలీసులు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని ఇంకా వారిని అనేక కోణాల్లో విచారించాల్సి ఉందని అంటున్నారు. హీరోయిన్స్ బయటకు వెళితే సాక్ష్యాలు తారుమరయ్యే అవకాశం ఉందని సాక్ష్యులను కూడా ప్రభావితం చేయవచ్చని అంటున్నారు.

 రాజకీయా నాయకుల పిల్లలను..

రాజకీయా నాయకుల పిల్లలను..

దీంతో న్యాయస్థానం కూడా అదే తరహాలో ఆలోచించి పూర్తి విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వాలని అనుకోవడం లేదని కన్నడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది డ్రగ్స్ డీలర్స్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరికొందరి రాజకీయా నాయకుల పిల్లలను, అలాగే స్టార్ హీరోలను కూడా విచారించే అవకాశం ఉందట.

Recommended Video

ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
 ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు?

ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు?

సంజనా, రాగిణి అరెస్ట్ అయినప్పటి నుంచి కన్నడ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు స్టార్ హీరోలకు డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయని అంతే కాకుండా వారు వారానికోసారి హెవీ డోస్ లో డ్రగ్స్ తీసుకుంటారని కథనాలు వస్తున్నాయి. దీంతో ఆ స్టార్ హీరోలు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X