Puneeth మా దేవుడు.. సమాధి ఎదుట పెళ్లి కోసం ప్రేమ జంట యత్నం.. చివరికి ఏమైందంటే?

పునీత్ రాజ్ కుమార్ మరణం గురించి ఇంకా కన్నడ ప్రేక్షకులు పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటికీ ఆయన మరణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఎంతోమంది వేలల్లో ఆయన సమాధి వద్దకు సందర్శన కోసం వస్తున్నారు. అయితే వారి సమాధి వద్ద పెళ్లి చేసుకుంటాము అని ఒక ప్రేమ జంట పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

 ఇంకా కోలుకోలేదు

ఇంకా కోలుకోలేదు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం కన్నడ ప్రేక్షకులనే కాక సౌతిండియా సినిమా పరిశ్రమ మొత్తాన్నీ పట్టికి కుదిపేసింది.. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎవరూ కోలుకోని పరిస్థితి. జిమ్ పూర్తి చేసుకున్న తర్వాత పునీత్ రాజ్ కుమార్ ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో అప్పటికప్పుడు హాస్పిటల్ కి వెళ్లారు. కానీ కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన శుక్రవారం నాడు మరణించారు

అభిమానుల సందర్శనార్థం

అభిమానుల సందర్శనార్థం

అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలా మంది ఆయన అభిమానులు మరణించారు. కొంతమంది ఆత్మహత్య చేసుకొని సరిపోతే మరికొంతమంది గుండెపోటు వచ్చి చనిపోయారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన అభిమానులను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నారు. అయితే ఆయన సమాధిని కూడా అభిమానుల సందర్శనార్థం వదిలివేశారు.

సమాధి ఎదుట పెళ్లి

సమాధి ఎదుట పెళ్లి

ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ సమాధి ఎదుట పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రేమ జంట సిద్ధమవుతోంది. ఈ ప్రేమ జంట కన్నడ మీడియా మొత్తం మీద హాట్ టాపిక్ అయ్యారు. బళ్లారి ప్రాంతానికి చెందిన గంగా, గురు ప్రసాద్ అనే ఇద్దరు యువతీ యువకులు శనివారం పునీత్ రాజకుమార్ సమాధి వద్దకు వచ్చారు. ఆయన సమాధి వద్ద పెళ్లి చేసుకుంటామని సిద్ధమవుతుండగా అక్కడికి వచ్చిన పోలీసులు వారిని వారించారు. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు దగ్గర ఈ ప్రేమికులు ఇద్దరూ పర్మిషన్ కూడా తీసుకున్నారట.

అందుకే అలా

అందుకే అలా

పునీత్ రాజ్ కుమార్ కి వీరాభిమానులయిన ఈ ప్రేమ జంట తమ స్నేహితులకు సమాచారం అందించామని వారు వచ్చిన తర్వాత ప్రేమ పెళ్లి పునీత్ రాజ్ కుమార్ సమాధి ఎదుట చేసుకుంటామని చెబుతున్నారు.. ఈ పెళ్లికి శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ లను కూడా పిలిచామని వాళ్ళు పెళ్ళికి రావడానికి ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ పునీత్ రాజ్ కుమార్ గారు బతికి ఉంటే పెళ్లి తర్వాత ఆయన ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకోవాలి అని అనుకున్నాము కానీ ఆయన మరణించారు కాబట్టి అది కుదిరే పని కాదని అందుకే ఆయన సమాధి ముందే పెళ్లి చేసుకుంటామని వారు చెబుతున్నారు.

Recommended Video

Allu Arjun, Sneha Reddy At TajMahal, Celebrates 10th Anniversary
అలా చేసుకున్నోళ్ళు బాగున్నారా?

అలా చేసుకున్నోళ్ళు బాగున్నారా?

మామూలుగా జాతకాలు చూపించుకుని ముహూర్తాలు పెట్టుకొని గుడిలో పెళ్లి చేసుకోవడం మామూలే అయితే అలా గుళ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ ధనవంతులవుతున్నారా? చివరి దాకా బాగుంటున్నారా? కాదు కదా పునీత్ చేస్తున్న సామాజిక సేవ చూస్తుంటే ఆయనకు మించిన దేవుడు ఇంకా ఎక్కడ ఉంటారు? అందుకే ఆయన సమాధి వద్ద పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యామని ఈ ప్రేమ జంట చెబుతోంది..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X