KGF Chapter 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్: ట్వీట్ చేసి వెల్లడించిన మాళవిక
స్టైలిష్ స్టార్ హీరో యశ్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి.. దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అదే సమయంలో యాక్షన్ విభాగంలో జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఇంతటి సక్సెస్‌ను చూసిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా నటి మాళవిక కీలక అప్‌డేట్ ఇచ్చారు.
మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో 'KGF Chapter 2'పై భారీ బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఏది వచ్చినా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇలాంటి సమయంలో కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ విషయాన్ని నటి మాళవిక అవినాష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇందులో రాఖీ భాయ్ గురించి తెలుసకునే జర్నలిస్టు పాత్రలో నటించిన ఆమె తాజాగా డబ్బింగ్ పార్ట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు.

అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 'KGF Chapter 2' డబ్బింగ్ పనులు ప్రారంభం అవడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











